Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఓ ఇంటివాడైన చంటిగాడు : తాజ్‌మహల్ హోటల్‌లో పెళ్లి.. శివబాలాజీ ట్వీట్

బాలనటుడిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఆ తరువాత హీరోగా కెరీర్‌ను ప్రారంభించిన హీరో బాలాదిత్య. ''ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం'' సినిమాతో బాలనటుడిగా సినీ రంగానికి పరిచయమైన బాలాదిత్య ఆ తరువాత ''జంబ

Webdunia
శనివారం, 13 ఆగస్టు 2016 (14:41 IST)
బాలనటుడిగా సినీపరిశ్రమలోకి అడుగుపెట్టి.. ఆ తరువాత హీరోగా కెరీర్‌ను ప్రారంభించిన హీరో బాలాదిత్య. ''ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం'' సినిమాతో బాలనటుడిగా సినీ రంగానికి పరిచయమైన బాలాదిత్య ఆ తరువాత ''జంబలకిడిపంబ'', ''ఏవండీ ఆవిడ వచ్చింది'', ''హలో బ్రదర్'', ''అన్న'', ''లిటిల్‌సోల్జర్స్‌'', ''బంగారు బుల్లోడు'', ''అబ్బాయిగారు'', వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 
 
''చంటిగాడు'' చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసి ''రూమ్‌ మేట్స్''‌, ''1940లో ఒక గ్రామం'' తదితర చిత్రాల్లో నటించి తానేంటో నిరూపించుకున్నాడు. హీరోగానే కాకుండా డబ్బింగ్‌ ఆర్టిస్టుగా, వ్యాఖ్యాతగా, గేయరచయితగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఈ హీరో ఇప్పుడు ఓ ఇంటివాడయ్యాడు.
 
జూబ్లీహిల్స్‌లోని తాజ్‌మహల్‌ హోటల్‌లో పెద్దల సమక్షంలో బాలాదిత్య పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి సినీ ప్రముఖులు, తదితరులు పాల్గొన్నారు. ఈ పెళ్లి వేడుక గురించి నటుడు శివబాలాజీ సోషల్‌మీడియా ద్వారా తెలిపారు. నూతన దంపతులతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేస్తూ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఓ ఇంటివాడైన చంటిగాడు : తాజ్‌మహల్ హోటల్‌లో పెళ్లి.. శివబాలాజీ ట్వీట్

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

18వ తేదీ నుంచి ఆన్‌లైన్‌లో ఆగస్టు కోటా ఆర్జిత సేవా టిక్కెట్లు

వివేకా హత్య కేసు... కడప జిల్లా కోర్టుపై సుప్రీం ఫైర్

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

తర్వాతి కథనం
Show comments