Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాల కృష్ణ పారితోషికం త‌గ్గించుకున్నారా!

Webdunia
బుధవారం, 24 నవంబరు 2021 (16:45 IST)
Bala krishna
నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలంటే హెవీ బ‌డ్జెట్‌తో కూడుకున్న‌వే. ద‌ర్శ‌కుడు క‌థ స్థాయిని మించి ఖ‌ర్చు పెట్టిస్తుంటాడు. నిర్మాత‌లు కూడా అదే స్థాయిలో వెచ్చిస్తుంటారు. బాల‌కృష్ణ రెమ్య‌న‌రేష‌న్ ఒక‌సారి ఫిక్స్ అయ్యాక చెప్పిన‌ట్లు ఇవ్వాల్సిందే. ఏమాత్రం తేడా వ‌చ్చినా అంతే సంగ‌తులు. నిక్క‌చ్చిగా వుండే బాల‌కృష్ణ అంతే నిక్క‌చ్చిగానే ముందుగా మాట్లాడే విధానం బ‌ట్టి ప్ర‌వ‌ర్తన వుంటుంది.
 
అయితే అఖండ సినిమాకు అందుకు మిన‌హాయింపు ఇచ్చాడ‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ చిత్రం ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీ‌ను లావిష్‌గా ఖ‌ర్చుపెట్టించారు. ఔట్‌పుట్ బాగుంటేనే ప్రేక్ష‌కులు రిసీవ్ చేసుకుంటారు. అరుణాచ‌లం లోని ప్ర‌ముఖ దేవాల‌యంలో షూటింగ్ చేయాల్సివుంది. అప్పుడే దేవాదాయ శాఖ మంత్రినిగా ఛార్జ్ తీసుకున్న మంత్రితో బాల‌కృష్ణ మాట్లాడి ప‌ర్మిష‌న్ ఇప్పించారు.
 
అఘోరా కు చెందిన ప‌లు స‌న్నివేశాలు అక్క‌డ అద్భుతంగా తీశారు. ఇదిలా వుండ‌గా, క‌రోనా స‌మ‌యంలో రెండుసార్లు వాయిదా ప‌డ‌డంతో షూటింగ్ జాప్యం జ‌ర‌గ‌డంతో నిర్మాత‌ మిర్యాల ర‌వీంద్ర రెడ్డికు ఆర్థికంగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితి నెల‌కొంది. దాంతో బాల‌కృష్ణ వాస్త‌వాన్ని తెలుసుకుని త‌న రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకుని చేశాడ‌ట‌. ఇందుకు నిర్మాత చాలా హ్యాపీగా ఫీల‌య్యారు. ఈ విష‌యాన్ని త‌న స‌న్నిహితుల‌వ‌ద్ద ఆయ‌న వెల్ల‌డించారు.
 
సో. ఏదిఏమైనా బాల‌కృష్ణ ప్ర‌స్తుత ప‌రిస్థితి చూసి రెమ్యున‌రేష‌న్ త‌గ్గించుకోవ‌డం విశేష‌మే. ఇటీవ‌లే పారితోషికాల విష‌యంతోపాటు ప‌లు స‌మ‌స్య‌ల గురించి అగ్ర నిర్మాత‌లు ఫిలింఛాంబ‌ర్‌లో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా బాల‌య్య విష‌యంతెలుగులోకి రావ‌డంతో వారంతా స‌మావేశంలో క‌ర‌తాళ‌ద్వ‌నులు చేశార‌ని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Prakash Raj: బెట్టింగ్ యాప్‌ కేసు.. ఈడీ ముందు హాజరైన ప్రకాష్ రాజ్

మణికొండలో దారుణం : వాటర్ ట్యాంకు ఢీకొని టెక్కీ దుర్మరణం

ఒక్కో బిడ్డను కంటే నగదు బహుమతి... చైనా సరికొత్త ప్రణాళిక

Elephant: తిరుమల శ్రీవారి మెట్టు సమీపంలో ఏనుగుల గుంపు.. యాత్రికులు షాక్

Andhra Pradesh: దుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాలు.. ఏఐ సాయంతో డ్రోన్స్.. ఏర్పాట్లు ముమ్మరం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments