ప్లీజ్.. ఆ ఒక్కటీ అడక్కండి.. కాస్త అర్థం చేసుకోండి... : హీరో ప్రభాస్

'బాహుబలి' చిత్రంతో జాతీయ స్థాయి హీరోగా మారిన ప్రభాస్‌ ఎక్కడకు వెళ్లినా ఓ ప్రశ్న తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. బాహుబలి చిత్రం తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం "సాహో". దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌‌తో ఈ చిత్రా

Webdunia
సోమవారం, 2 అక్టోబరు 2017 (13:02 IST)
'బాహుబలి' చిత్రంతో జాతీయ స్థాయి హీరోగా మారిన ప్రభాస్‌ ఎక్కడకు వెళ్లినా ఓ ప్రశ్న తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. బాహుబలి చిత్రం తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం "సాహో". దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఇటీవల జాతీయ మీడియాతో ముచ్చటించారు. తాను ప్రస్తుతం హిందీ భాష నేర్చుకోవడంలో బిజీగా ఉన్నానని తెలిపారు. పెళ్లి, సినిమా కెరియర్, సాహోలోని కో-స్టార్ శ్రద్ధా కపూర్ గురించిన పలు ఆసక్తికర విషయాలను ప్రభాస్ వెల్లడించారు.
 
పెళ్లి గురించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు ప్రభాస్ రాజు సమాధానమిస్తూ... తన వ్యక్తిగత జీవితాన్ని బహిరంగపరచడం నాకు ఇష్టం ఉండదు. చాలామంది నాకు అఫైర్లు ఉన్నాయంటూ, పెళ్లి ఎప్పడు చేసుకుంటారని తరచూ అడుగుతూ ఉంటారు. అలాంటివారు నన్ను కాస్త అర్థం చేసుకోవాలి. ఇలా పెళ్లి, ప్రేమ గురించి తరచూ అడగడం కృత్రిమంగా అనిపిస్తుంది. నా వ్యక్తిగత, ఇంటి వ్యవహారాలు నాకే పరిమితం కావాలనుకుంటాను. అయితే పెళ్లి చేసుకుంటే అందరితో చెప్పే చేసుకుంటాను అంటు ముక్కుసూటిగా సమాధానమిచ్చాడు. 
 
ఇకపోతే.. ‘సాహో’ చిత్రం కోసం హిందీ నేర్చుకుంటున్నాను. ఈ చిత్ర హీరోయిన్ శ్రద్ధాదాస్ కంటే మా రైటర్ నాకు హిందీ బాగా నేర్పిస్తున్నారు. ఈ సినిమా చేస్తుంటే హిందీ తప్పనిసరిగా నేర్చుకోవాలనిపిస్తోంది. శ్రద్ధాను కలిసిన ప్రతీసారీ హిందీలో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటాను. నేను మాట్లాడే హిందీని విని ఆమె ఇంగ్లీషులో మాట్లాడటం ప్రారంభిస్తుంది. అప్పుడు నేను శ్రద్ధాతో హిందీలోనే మాట్లాడమని చెబుతుంటాను అంటూ చమత్కరించారు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments