Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి 2'లో అమితాబ్ బచ్చన్.. ఫీవర్ అప్పుడే మొదలైందా?

బాహుబ‌లి-2 వేడి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 28న బాహుబ‌లి 2 ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి సినిమా రూ.120 కోట్ల‌తో తెర‌కెక్

Webdunia
శుక్రవారం, 28 అక్టోబరు 2016 (11:41 IST)
బాహుబ‌లి-2 వేడి అప్పుడే స్టార్ట్ అయిపోయింది. వ‌చ్చే స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 28న బాహుబ‌లి 2 ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. బాహుబ‌లి సినిమా రూ.120 కోట్ల‌తో తెర‌కెక్కి అంచ‌నాల‌ను మించి రూ.600 కోట్లు కొల్ల‌గొట్ట‌డంతో బాహుబ‌లి -2పై ప్ర‌పంచ‌వ్యాప్తంగా భారీ అంచ‌నాలు ఉన్నాయి. బాహుబ‌లి -2 ప్రి రిలీజ్ బిజినెస్ కూడా అప్పుడే స్టార్ట్ అయ్యింది. 
 
మరోపక్క ఈ సినిమా షూటింగుతో జక్కన్న బిజిబిజీగా వున్నారు. డిసెంబర్ మొదటివారం నాటికి ఈ సినిమా షూటింగ్ పార్టును పూర్తిచేయాలనే ఆలోచనలో ఆయన వున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అమితాబ్‌ను కలవడం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలోని 'సర్కార్ 3' సెట్స్‌లో రాజమౌళి అమితాబ్‌ను కలుసుకున్నారు.
 
'బాహుబలి 2'లో ఒక కీలకమైన పాత్రను పోషించవలసిందిగా అమితాబ్‌ను కోరడం కోసమే ఆయనని రాజమౌళి కలిశాడనే వార్తలు వెలువడుతున్నాయి. మరికొందరు ఈ సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ కోసం ఇటీవల ముంబై వెళ్లిన రాజమౌళి, మర్యాద పూర్వకంగా అమితాబ్‍‌‌ను కలిసి ఉంటారని అంటున్నారు. వీటిలో ఏది నిజమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమకు పెద్దలు ఒప్పుకోలేదు.. ప్రేమికుల ఆత్మహత్యాయత్నం.. ప్రేయసి మృతి.. ప్రియుడు?

Varshini: లేడీ అఘోరీని పట్టించుకోని శ్రీ వర్షిణి.. ట్రెండింగ్‌ రీల్స్‌ చేస్తూ ఎంజాయ్ చేస్తోంది..! (video)

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments