Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరో ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయింది!.. ఎపుడో తెలుసా?

'బాహుబలి' చిత్రంతో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యాడు. 'బాహుబ‌లి' త‌ర్వాత ప్ర‌భాస్ ఎక్క‌డికి వెళ్లినా సులువుగా గుర్తు ప‌ట్టేస్తున్నారు. అంతేనా 'బాహుబ‌లి' అని పొగిడేస్తున్నారు. ఇదే జోష‌లో ప్ర‌భ

Webdunia
గురువారం, 20 అక్టోబరు 2016 (11:40 IST)
'బాహుబలి' చిత్రంతో ప్రభాస్ ప్రపంచ వ్యాప్తంగా పాపుల‌ర్ అయ్యాడు. 'బాహుబ‌లి' త‌ర్వాత ప్ర‌భాస్ ఎక్క‌డికి వెళ్లినా సులువుగా గుర్తు ప‌ట్టేస్తున్నారు. అంతేనా 'బాహుబ‌లి' అని పొగిడేస్తున్నారు. ఇదే జోష‌లో ప్ర‌భాస్ ఇప్పుడు 'బాహుబ‌లి 2' షూటింగ్‌కు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్‌ల‌ర్ ఎవ‌రంటే ప్ర‌భాస్ పేరు చెప్పాలి. 36 సంవ‌త్స‌రాలు వ‌చ్చినా ప్ర‌భాస్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోలేదు. రాజ‌మౌళి దెబ్బ‌కు మూడు సంవ‌త్స‌రాలుగా 'బాహుబ‌లి' కోస‌మే త‌న కేరీర్‌ను త్యాగం చేశాడు. 
 
ప్రభాస్ ఏజ్ హీరోలు ఇప్పటికే పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అవుతున్నారు. ప్రభాస్ మాత్రం ఇప్పటికీ బ్యాచులర్‌గానే ఉన్నారు. ఇదిలావుంటే ఎట్ట‌కేల‌కు ప్ర‌భాస్ ఓ ఇంటి వాడ‌వుతున్నాడ‌న్న వార్త‌లు సోష‌ల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ప్ర‌భాస్ పెళ్లి కోసం పెద‌నాన్న కృష్ణంరాజు గ‌త నాలుగైదేళ్లుగా పోరేసుకుని పోరాటం చేస్తున్నా ప్ర‌భాస్ మాత్రం వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నాడు. 
 
ప్రస్తుతం 'బాహుబలి-2' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్ ఈ సినిమా కోసం దాదాపు ఐదేళ్లు కేటాయించాడు. ఆ సమయం ఆయనకు చాలా విలువైన టైం... ఆ టైంలో పెళ్లి చేసుకొని ఓ ఇంటివాడవుతారనుకున్నారు అంతా కానీ రాజమౌళి ప్రాజెక్ట్ ఆయనకు చాలా మంచిపేరు తీసుకొచ్చింది. ప్రభాస్ రేంజ్ బాలీవుడ్ బోర్డర్‌ను క్రాస్ చేసి మేడమ్ టుస్సాడ్స్‌లో ప్రపంచ ప్రముఖుల సరసన తన మైనపు విగ్రహం ప్రతిష్టించే వరకు వెళ్లింది. 
 
అయితే చాలా రోజులుగా ప్రభాస్ పెళ్లి గురించి వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలావుంటే.. ఈ హీరో కూడా తనకు కాబోయే భార్యను వెతికే పనిలో పడ్డాడట. ప్రభాస్‌కు తగిన అమ్మాయిని వెతికే పనిలో ఉన్న కృష్ణంరాజు అండ్ ఫ్యామిలీ చివరకు విశాఖపట్నంలో ప్రభాస్ హైటు, వెయిటు, అందానికి సరిజోడి అయిన అమ్మాయిని ఎంపిక చేసారట. ఆమె ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార్తె అని తెలుస్తోంది. వచ్చే ఏడాది మొదట్లో విశాఖపట్నంలోనే అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరుగవచ్చని సన్నిహితులు అంటున్నారు. దాదాపుగా 'బాహుబలి-2' సినిమా కంటే ముందే ప్రభాస్ వివాహం జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆత్మహత్య చేసుకుంటే ప్రియురాలు ఒంటరిదైపోతుందని...

Posani: పోసానికి ఛాతీ నొప్పి వచ్చిందా? సీఐ వెంకటేశ్వర్లు ఏమన్నారు?

అత్త కుంభమేళాకు .. భర్త పనికి వెళ్లారు.. ప్రియుడిని ఇంటికి పిలిచి...

రెండు తలల నాగుపాము.. రెండు ఎలుకల్ని ఒకేసారి తినిస్తోంది.. వీడియో వైరల్

Dhee: ఢీ షో డ్యాన్సర్ నన్ను మోసం చేశాడు.. సెల్ఫీ వీడియో ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

వేసవిలో పుదీనా రసం బోలెడన్ని ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments