రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలికి రావాల్సిన పేరు కంటే ఎక్కువే వచ్చింది. ఆ చిత్రంతో హీరో ప్రభాస్, రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని సంపాదించారు. ఇప్పుడు దానికి సీక్వెల్.. వస్తోంది. వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. ఏదో లుక్ అంటూ.. ప్రతిస
రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలికి రావాల్సిన పేరు కంటే ఎక్కువే వచ్చింది. ఆ చిత్రంతో హీరో ప్రభాస్, రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో కీర్తిని సంపాదించారు. ఇప్పుడు దానికి సీక్వెల్.. వస్తోంది. వందల కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు. ఏదో లుక్ అంటూ.. ప్రతిసారీ ఏదోరకంగా పబ్లిసిటీ చేస్తున్నారు. ఇటీవలే విజువల్ ఎఫెక్ట్స్ 3డి వెర్షన్‌ను బయటకు తెచ్చారు. అది కేవలం మేకింగ్ పరంగా కావడంతో జనాలకు రీచ్ కాలేదు. ఇప్పుడు బాహుబలి2 లోని సీన్స్ దొంగతనంగా లీక్ చేసి అమ్ముకుంటున్నాడని.. కృష్ణ అనే వ్యక్తిని విజయవాడలో అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు.
ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్న రాజమౌళి... ఈ విషయంలో ఎందుకు కేర్ తీసుకోలేదు. ఆయన టీమ్.. అంటే ఆయన కొడుకు పర్యవేక్షణలో ఇదంతా పోస్ట్‌ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. కొంతభాగం రాజమౌళి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇంతకీ లీక్ చేయాలంటే అతనికెంత టైమ్ కావాలి. ఎంతోమంది చూస్తుంటారు. సిసి కెమెరాలున్నాయి. ఇవన్నీ తెలిసి కూడా చేశాడంటే.. తను నిజంగా చేసే ధైర్యముందా? అతని వెనుక ఇంకెవరైనా వున్నారా? ఒకవేళ లీక్ చేస్తే.. అతను బలిపశువు అవుతాడా? వంటి విషయాలు ఫిలింనగర్లో చక్కెర్లు కొడుతున్నాయి.
అయితే విశ్వసవనీయ సమాచారం ప్రకారం.. అతను పోస్ట్‌ప్రొడక్షన్స్ జరిగే ల్యాబ్ నుంచి అందరి కళ్లు గప్పి తన స్నేహితులకు రెండు నిముషాల విజువల్స్ పంపాడట. దాన్ని అతను వాట్సప్‌లో వేరేవారికి పంపడంతో.. సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్‌గా మారిపోయింది. అసలు ఇంతలా అతను చేయడానికి కారణమేమిటి అనేది కూడా చర్చ మొదలైంది. ఇది కావాలని చిత్ర నిర్మాతలు చేయించారా... అనే కోణంలో కూడా వార్తలు వస్తున్నాయి.
ఎందుకంటే.. ఇటీవలే పెద్ద నోట్ల రద్దు తర్వాత... బాహుబలి నిర్మాతలపై ఐటీ దాడులు జరిగాయి. విపరీతంగా లాభాలు వచ్చాయి. వందల కోట్లాది రూపాయలు సినిమాలు పెట్టడం.. బిజినెస్‌పరంగా అమ్ముడు కావడం వంటి విషయాలు పెద్ద చర్చకు దారితీశాయి. ఇలాంటి తరుణంలో.. తమపై వున్న ఫోకస్‌ను కాస్త డైవర్ట్ చేసేందుకు... సింపథీ కోసం.. ఇలాంటి జిమ్మిక్కులు చేసుంటారని కొంతమంది సినీజనం అనుకుంటున్నారు. బాహుబలి సినిమా అంటే ఐటీ అధికారులకూ చాలా ఇంట్రస్ట్ అట.
ఆ చిత్రం విడుదల తర్వాత ఐటీ అధికారులు దర్శక నిర్మాతలకు విషెస్ కూడా చెప్పారు. మరి ఇలాంటి సిట్యువేషన్లో బాహుబలి 2 లీక్‌లు కావడం.. పైగా అది రఫ్ వెర్షన్.. ఇంకా పోస్ట్ప్రొడక్షన పనులు పూర్తికాని వెర్షన్ అది. దాన్ని లీక్ చేయడం.. చాలా నిఘా వున్న ఆ ల్యాబ్ రూమ్‌లో ఎందుకు జరుగుతుంది? అనేది కూడా విన్పిస్తోంది. ఏది ఏమైనా.. కొద్దిరోజులు ఇది మరుగున పడుతుందనీ.. అప్పుడు.. చిత్ర యూనిటే.. కృష్ణ అనే వ్యక్తికి బెయిల్ కూడా ఇప్పిస్తుందని కొందరు సెటైర్లు వేసుకుంటున్నారు. చూద్దాం.. రిలీజ్ లోపుల ఎన్ని వార్తలు వస్తాయో...