Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా కులానికి చెందిన హీరో.. టిక్కెట్ ధర రూ.3 వేలు... 'బాహుబలి' టిక్కెట్లకు కూడా కులగజ్జి

'బాహుబలి'.. ఈ చిత్రం కోసం ఒక్క తెలుగు ప్రేక్షకులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు గత యేడాదిన్నర ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ చిత్రం ఈనెల 28వ తేదీన విడుదల చేసేందుకు

Webdunia
బుధవారం, 26 ఏప్రియల్ 2017 (09:11 IST)
'బాహుబలి'.. ఈ చిత్రం కోసం ఒక్క తెలుగు ప్రేక్షకులే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు గత యేడాదిన్నర ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ చిత్రం ఈనెల 28వ తేదీన విడుదల చేసేందుకు దర్శక నిర్మాతలు ముందుకు వచ్చారు. దీంతో ప్రతి సినీ అభిమాని  ఎంతో సంతోషపడ్డారు. 
 
అయితే, ఆ సంతోషం ఎంతో సేపు నిలువలేదు. కారణం.. బాహుబలి టిక్కెట్లకు కులగజ్జి పట్టడమేనట. మా కులానికి చెంది హీరో.. టిక్కెట్ ధర ఇది అంటూ నిలబెట్టి నల్ల బజారు (బ్లాక్ మార్కెట్‌)లో అమ్ముతున్నారట కొందరు ఫ్యాన్స్. ఇందుకు ఉదాహరణే.. బాహుబలి-2 సినిమా ప్రీమియర్‌ షో టికెట్‌ ధర అక్షరాలా 3000 రూపాయలు పలకడమేనట! మామూలు షోలకు కూడా కాంబో టికెట్ల పేరుతో థియేటర్‌ను బట్టి రూ.300 నుంచి రూ.500, రూ.600 దాకా పెంచి విక్రయిస్తున్నాయి. ఇపుడ ఫ్యాన్స్ కూడా ఈ తరహా విక్రయాలకు పూనుకోవడంతో సాధారణ ప్రేక్షకులు ఈ చిత్రం చూసేందుకు మరో రెండు మూడు వారాల పాటు వేచిచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. 
 
సాధారణంగా స్టార్‌ హీరోల కొత్త సినిమా వస్తోందంటే చాలు.. ఆ హీరో కులం, స్థాయి.. లేదా సినిమా స్థాయి.. ఇలా చాలా లెక్కలు తెరపైకి వస్తాయి. దీనికితోడు.. అభిమానులు తమ అభిమాన హీరో గురించి గొప్పలు చెప్పుకునేలా టికెట్‌ రేట్లు అడ్డగోలుగా పెంచేయడం సర్వసాధారణంగా ఉన్న విషయం. ఇక బ్లాక్‌ టికెట్ల విక్రయాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments