Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1500 కోట్ల కలెక్షన్లపై అస్త్రాన్ని ఎక్కుపెట్టిన "బాహుబలి"... లక్ష్యఛేదన సాధ్యమేనా?

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి 2 కంక్లూజన్'. ఈ చిత్రం గత నెల 28వ తేదీన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా బ

Webdunia
సోమవారం, 8 మే 2017 (12:53 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి తెరకెక్కించిన చిత్రం 'బాహుబలి 2 కంక్లూజన్'. ఈ చిత్రం గత నెల 28వ తేదీన విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తోంది. ఇప్పటికే రూ.వెయ్యి కోట్లు వసూలు చేసిన తొలి చిత్రంగా బాహుబలి రికార్డు నెలకొల్పింది. ముఖ్యంగా, బాహుబలి దెబ్బకు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు కుదేలైపోయింది. ఈ రంగానికి చెందిన గత రికార్డులన్నీ బాహుబలి దెబ్బకు తుడిచిపెట్టుకునిపోయాయి.  
 
బాహుబలి చిత్రం విడుదలైన కేవలం 10 రోజుల్లోనే రూ.వెయ్యికోట్లు వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ ఆర్కా మీడియా అధికారికంగా ప్రకటించింది. వసూళ్లు ఇప్పటికీ నిలకడగా ఉండటంతో బాహుబలి-2 పుల్‌రన్‌లో రూ.1500 కోట్లు దాటేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బాహుబలి 2, ఇప్పటికీ కాసుల పంట పండిస్తోంది. విడుదలైన అన్నిచోట్లా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. 
 
ఇప్పటికే అన్ని రికార్డులను బద్దలు కొట్టి ఇండియాస్ బిగ్గెస్ట్ బాక్ల్ బస్టర్‌గా నిలిచిన బాహుబలి 2, ఇప్పుడు సరికొత్త రికార్డ్‌లను నెలకొల్పే దిశగా దూసుకుపోతుంది. ఆదివారం ఉదయానికి రూ.వెయ్యి కోట్ల వసూళ్లు సాధించి ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెర తీసింది. 
 
ఒక ప్రాంతీయ చిత్రం రూ.100 కోట్ల వసూళ్లు సాధించటమే కష్టంగా ఉన్న సమయంలో రూ.1000 కోట్ల వసూళ్లు సాధించిన తొలి చిత్రంగా బాహుబలి రికార్డ్ సృష్టించింది. ఈవారాంతం వరకు అన్ని థియేటర్లలో ఆన్‌లైన్ బుకింగ్స్ హౌస్‌ఫుల్ కావడంతో బాహుబలి రూ.1500 కోట్ల మార్క్‌ను కూడా అతి త్వరలో చేరుకోవడం తథ్యమని సినీ ట్రేడ్ విశ్లేషకులు అంటున్నారు.

సీఎం రేవంత్ సర్కారుపై కేటీఆర్ సంచలన ఆరోపణలు : 50 రోజుల్లో రూ.1100 కోట్లు స్కామ్

పాయల్ కపాడియా: 30 ఏళ్ల తర్వాత భారత్‌ తరఫున కేన్స్‌లో చరిత్ర సృష్టించిన ఈమె ఎవరు?

వాయిస్ చేంజింగ్ యాప్‌ ఉపయోగించి యువతులపై అత్యాచారం ... ఎక్కడ?

ప్లీజ్... మా దేశాన్ని ఆదుకోండి.. ప్రపంచ దేశాలకు మాల్దీవులు ప్రెసిడెంట్ విన్నపం!!

థర్డ్ ఏసీనా? జనరల్ బోగీనా? రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణికుల రద్దీ!!

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments