Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి-2' చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్... సూపర్బ్ అన్న సెన్సార్ సభ్యులు!

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి-2' ది కంక్లూజన్ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్ మంజూరు చేసినట్టు సమాచారం. నిజానికి 'బాహుబలి'

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (14:35 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన దృశ్యకావ్యం 'బాహుబలి-2' ది కంక్లూజన్ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికేట్ మంజూరు చేసినట్టు సమాచారం. నిజానికి 'బాహుబలి' చిత్రం మొదటి భాగం విడుదలైనప్పటి నుంచి ఈ చిత్రం రెండో భాగం కోసం సినీ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠతో ఎదురు చూసున్నారు. ముఖ్యంగా 'బాహుబలి'ని కట్టప్ప ఎందుకు చంపారన్న ప్రశ్నే ప్రతి ఒక్కరి మెదళ్లను తొలుస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో గత యేడాదిన్నర కాలంగా ఎన్నో కష్టనష్టాలకోర్చి.. భారీ బడ్జెట్‌తో, భారీ విజువల్ గ్రాండియర్‌తో, తెలుగు చలనచిత్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గ్రాండ్‌గా ఈ చిత్రం రెండో భాగాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం సోమవారం సెన్సార్ పూర్తైందని టాక్. దీనిపై అధికారిక సమాచారం ఏమీ లేకున్నా.. ఫిల్మ్‌నగర్ సర్కిల్స్ ప్రకారం ఏప్రిల్ 17న చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ వచ్చినట్టు తెలుస్తోంది. 'బాహుబలి-2'కి సెన్సార్ యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం. సినిమా చాలా బాగుందని సెన్సార్ సభ్యులు అన్నట్టు తెలుస్తోంది. 
 
కాగా, తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆయా భాషల్లోనూ సెన్సార్ బోర్డు క్లియరెన్స్ కోసం 'బాహుబలి' చిత్రం వేచి చూస్తోందట. కాగా, ఈ చిత్రం ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇంటి ముందు చెత్త వేయుద్దన్నందుకు మహిళ తల నరికేశాడు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments