డిన్న‌ర్ పార్టీలో క‌నిపించ‌ని స‌మంత - చైతుతో విభేదాలు నిజ‌మే?

Webdunia
శనివారం, 25 సెప్టెంబరు 2021 (18:12 IST)
Nag dinner party
ఇప్పుడు హాట్ టాపిక్‌గా వున్న అంశం నాగ‌చైత‌న్య‌, సమంత కాపురం. దీనిపై ప‌లుర‌కాలుగా వార్త‌లు వ‌స్తున్నాయి. సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతుంది. తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన స‌మంత‌ను ఇదే విష‌య‌మై అడిగితే చెప్ప‌కుండా విసుక్కుంది. `ల‌వ్‌స్టోరీ` సినిమా విడుద‌ల‌కు ముందు నాగ‌చైత‌న్య ఇచ్చిన ఇంటర్వ్యూల‌లో ఎక్క‌డా స‌మంత ప్ర‌స్తావ‌న రాకుండా మేనేజ్ చేశారు నిర్వాహ‌కులు. అయితే ఓ ఆంగ్ల ప్ర‌తిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో విడాకుల విష‌యాన్ని త‌ప్పుప‌ట్టాడు. కానీ లోలోప‌ల ఏదో జ‌రుగుతుంద‌నేది వాస్తంగా అనిపిస్తుంది.
 
విడుద‌లరోజు సినిమా ఎక్క‌డ చూస్తార‌నేదానికి నాగ‌చైత‌న్య బ‌దులిస్తూ, నేను ఏ థియేట‌ర్‌లో చూడాల‌నేది ఇంకా అనుకోలేదు అన్నాడే కానీ కుటుంబంతో చూస్తాన‌ని అన‌లేదు. ఇక తాజాగా ల‌వ్ స్టోరీ సినిమా విడుద‌లై స‌క్సెస్ మీట్ కూడా నాగ‌చైత‌న్య జ‌రుపుకున్నారు. అదేరోజు రాత్రి నాగార్జున డిన్న‌ర్ పార్టీ ఏర్పాటు చేశారు.  ముందుగా నైట్ కేక్‌ను క‌ట్ చేశారు. ఆ పార్టీకి అమీర్‌ఖాన్‌, ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల‌, అఖిల్ హాజ‌ర‌య్యారు. కానీ ఎక్క‌డా స‌మంత క‌నిపించ‌లేదు. ఈ ఫొటోను నాగ్ సోష‌ల్‌మీడియాలో పెట్టారు. ప‌నిలోప‌నిగా జాత‌కాలు చెప్పే నాగ‌రాజు అనే వ్య‌క్తి మాత్రం మూడేళ్ళ‌నాడే వీరి బంధం బీట‌లు వారుతుంద‌ని చెప్పాన‌ని ఇప్పుడు సోష‌ల్‌మీడియావేదిక‌గా వెల్ల‌డిస్తున్నాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దేశంలోనే ఒకే ఉపాధ్యాయుడు వున్న స్కూళ్లతో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం

డ్రైవర్ రాయుడు వీడియోను నిన్ననే చూశా... నాపై కుట్ర జరుగుతోంది... ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి

Balakrishna: ఓపికపట్టండి.. అవసరమైనప్పుడు మంత్రి పదవి వస్తుంది.. బాలయ్య

వామ్మో.. జోగి రమేష్ నకిలీ మద్యం తయారు చేయమన్నారట.. జనార్ధన్ రావు వీడియో వైరల్

అమరావతిని ఆకాశంలో నిర్మించలేం.. దేనికైనా భూమి కావాలి కదా?: చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

సుఖసంతోషాలకు పంచసూత్రాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments