Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుస్మితాసేన్‌ బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ ఇచ్చిందా? అతడు మారడు అంటూ..?

Webdunia
గురువారం, 11 ఫిబ్రవరి 2021 (18:42 IST)
సెలెబ్రిటీల మధ్య ప్రేమ- పెళ్లి- బ్రేకప్‌లు మామూలే. తాజాగా ఆ లిస్టులో మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్ చేరిపోయింది. ఇన్నాళ్లు బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఈమె ప్రస్తుతం బాయ్‌ఫ్రెండ్ రోహ్‌మన్ షాల్‌తో బ్రేకప్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ గత కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. 2018 నుంచి సుస్మిత-రోహ్‌మన్ సహజీవనం చేస్తున్నారు. 
 
అయితే తన వ్యక్తిగత జీవితం గురించి ఓ పోస్ట్ పెట్టి తన ఫాలోవర్లకు ఒకింత షాక్‌కు గురిచేసింది సుస్మిత. 'సమస్య ఏంటంటే అతడు మారుతాడని మహిళ భావిస్తుంది. కానీ అతడు మారడు. పురుషులు చేసే తప్పును ఆమె ఎప్పటికీ క్షమించదు. ఆమె వదిలి వెళ్లిపోతుంది. ఈ కథలో నీతి ఏంటంటే అతడు మారడు. ఆమె వెళ్లిపోతుంది..' అంటూ పోస్ట్ పెట్టింది సుస్మితాసేన్‌.
 
ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుంది. సుస్మితాసేన్ పెట్టిన సందేశంతో బాయ్‌ఫ్రెండ్ రోహ్‌మన్‌కు సుస్మితాసేన్ దాదాపు బ్రేకప్ చెప్పిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే విషయంపై నెటిజన్లు క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్నారు. ఒక్కో నెటిజన్లు ఒక్కో విధంగా కామెంట్లు పెడుతున్నారు.సుదీర్ఘ విరామం తర్వాత ఇటీవలే ఆర్య వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments