Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహో హీరోయిన్ అనుష్కే నట..రమేష్ బాలా ట్వీట్ నిజమే చెబుతోందా?

ఒక దేవసేన, ఒక అమరేంద్ర బాహుబలి.. ఈ జంట ఇప్పుడు భారతదేశంలో అత్యంత విజయవంతమైన జంట. ఒక జీవితకాలానికి సరిపడ చిరకీర్తిని ఈ రెండు పాత్రలూ ఆర్జించుకున్నాయి. ఇప్పటికీ బాహుబలి హ్యాంగోవర్ నుంచి బయటపడని ఈ జంట మళ

Webdunia
గురువారం, 6 జులై 2017 (06:05 IST)
ఒక దేవసేన, ఒక అమరేంద్ర బాహుబలి.. ఈ జంట ఇప్పుడు భారతదేశంలో అత్యంత విజయవంతమైన జంట. ఒక జీవితకాలానికి సరిపడ చిరకీర్తిని ఈ రెండు పాత్రలూ ఆర్జించుకున్నాయి. ఇప్పటికీ బాహుబలి హ్యాంగోవర్ నుంచి బయటపడని ఈ జంట మళ్లీ మరో సినిమాలో జత కట్టడానికి సిద్ధమైపోయారని వార్తలు. తమిళ చిత్ర విశ్లేషకుడైన రమేష్ బాలా ట్వీట్ సాక్షిగా వీరిరువురు సాహోలో జంటగా నటిస్తున్నారని తెలుస్తోంది.
 
ప్రభాస్-అనుష్క జంట తెలుగు వెండితెర మీద ఎవర్‌గ్రీన్ జంటగా పేరు తెచ్చుకుంది. బాహుబలితో భారీ విజయాలను అందుకున్న ఈ జంట తాజాగా మరో సినిమాలో అలరించబోతోంది. యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్‌లో ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. టీజర్‌తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు.
 
దీపికా పదుకునే, కత్రినా కైఫ్, అనుష్క.. ఇలా పలువురి పేర్లు వినిపించినా చిత్ర యూనిట్ అయితే ఇప్పటి వరకు ఎవరినీ నిర్ధారించలేదు. తాజాగా తమిళ సినీ విశ్లేషకుడైన రమేష్ బాలా సాహో చిత్రంలో హీరోయిన్‌గా అనుష్కను తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. కాగా, తెలుగు, తమిళ, హిందీ భాషల్లో  సాహో తెరకెక్కుతోంది. అయితే ఈ విషయంపై మూవీ టీం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కుమారుడికి క్షమాభిక్ష పెట్టుకున్న జో బైడెన్!!

మానవత్వాన్ని చాటిన నందిగామ ఎస్సై.. ఏం చేశారంటే? (video)

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్.. డిప్యూటీ సీఎం రేసులో శ్రీకాంత్ షిండే!!

భోజనం పళ్లెంలో ఏమేం ఉండాలి? రోజుకు ఎంత ప్రోటీన్ అవసరం

విద్యార్థిని తల్లిపై మోజుపడి మృత్యు ఒడిలోకి చేరుకున్న యువకుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments