Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహానటిలో కీలకపాత్ర. ఇంకెవరిది.. అనుష్కదే..

భారతీయ చలనచిత్రరంగంలోనే ముగ్ధమనోహర్ అపరూప కథానాయకి సావిత్రి అని దేశమంతా ఒప్పుకున్న వాస్తవం. దక్షిణాది చిత్రసీమ పుణ్యం చేసుకుంటే ఆవిర్భవించిన నవరస నటనా శిరోమణి సావిత్రి. ఆమెనటనలో ఎన్ని కోణాలు దాగి ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక్క మాయాబజార్ చూస్తే చాలు.

Webdunia
గురువారం, 20 ఏప్రియల్ 2017 (04:29 IST)
భారతీయ చలనచిత్రరంగంలోనే ముగ్ధమనోహర్ అపరూప కథానాయకి సావిత్రి అని దేశమంతా ఒప్పుకున్న వాస్తవం. దక్షిణాది చిత్రసీమ పుణ్యం చేసుకుంటే ఆవిర్భవించిన నవరస నటనా శిరోమణి సావిత్రి. ఆమెనటనలో ఎన్ని కోణాలు దాగి ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక్క మాయాబజార్ చూస్తే చాలు. అలనాటి నాయిక సావిత్రి జీవితకథ ఆధారంగా ‘మహానటి’ తీయనున్నట్టు ప్రకటించగానే..వెండితెరపై సావిత్రి వెలుగులే చూపిస్తారా లేదా ఆమె వ్యక్తిగత జీవిత ఘటనలూ ఉంటాయా అని ప్రేక్షకుల మదిలో ఎన్నో ప్రశ్నలు చెలరేగాయి.
 
అయితే  ఫిల్మ్‌నగర్‌ వర్గాల సమాచారం ప్రకారం.. ‘మహానటి’లో 1940 నుంచి 80 వరకూ సావిత్రి రియల్‌ అండ్‌ రీల్‌ లైఫ్‌ను చూపిస్తారని తెలుస్తోంది. తమిళ ‘మాయా బజార్‌’, ‘మిస్సమ్మ’ సినిమాల షూటింగ్‌ టైమ్‌లో జెమినీ గణేశన్‌ (తమిళ హీరో), సావిత్రి మధ్య ప్రేమ చిగురించిందనీ, తర్వాత వాళ్ల బంధం బలపడిందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇప్పుడీ సినిమాలో ఆ అంశాలను ప్రముఖంగా ప్రస్తావిస్తారట! 
 
సావిత్రిగా కీర్తీ సురేశ్, విలేకరిగా సమంత నటించనున్నారని ఇప్పటికే చిత్ర నిర్మాతలు ప్రకటించేశారు. ఈ సినిమాలో మరో కీలక పాత్రకు అనుష్కను సంప్రదించారట. ఏ పాత్రలో నటించమని ఆమెను అడిగారనేది ఇప్పటికైతే తెలీదు‌. సావిత్రి సమకాలికురాలిగా శక్తివంతమైన పాత్రలు నటించిన మరో నటి భానుమతి మాత్రమే. అయితే భానుమతి, సావిత్రికి పెద్దగా సన్నిహిత సంబంధాలు ఉండేవి కావు.
 
 ‘రుద్రమదేవి’, ‘సైజ్‌ జీరో’ వంటి లేడీ ఓరియెంటెడ్‌ సినిమాల్లో అనుష్కే మెయిన్‌ హీరోయిన్‌ అని తెలిసిందే. ‘బాహుబలి–2’లోనూ ఆమెది శక్తివంతమైన పాత్రే. జీవితకాలానికి సరిపడిన అలాంటి పాత్రలు చేసిన అనుష్క ‘మహానటి’లో కీలక పాత్రను అంగీకరిస్తారో లేదో వేచి చూడాలి. ప్రకాశ్‌రాజ్‌ను సైతం కీలక పాత్ర కోసం చిత్రబృందం సంప్రదించారట. ‘ఎవడే సుబ్రమణ్యం’ ఫేమ్‌ నాగ అశ్విన్‌ దర్శకత్వంలో వైజయంతి మూవీస్‌ సమర్పణలో స్వప్న సినిమాస్‌ నిర్మించనున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ మే రెండోవారంలో మొదలు కానుంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

అప్పుల బాధ.. తెలంగాణలో ఆటో డ్రైవర్ ఆత్మహత్య.. ఈఎంఐ కట్టలేక?

రేవంత్‌రెడ్డి హయాంలో ప్రజల శాపనార్థాలు తప్పట్లేదు.. కవిత ఫైర్

మేమేమైన కుందేళ్లమా? ముగ్గురు సంతానంపై రేణుకా చౌదర్ ఫైర్

నెలలో ఏడు రోజులు బయట తిండి తింటున్న హైదరాబాదీలు!

ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ఎప్పటి నుంచో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments