Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబలి'తో అనుష్కకు ఎక్కిందా...?!!

తెలుగు అగ్ర హీరోయిన్లలో అనుష్క ఒకరు. ఇప్పటికే తెలుగు సినీపరిశ్రమలో దూసుకెళుతూ లక్షలాదిమంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోంది అనుష్క. బాహుబలి సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకున్న అనుష్క... భాగమతి చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమ

Webdunia
సోమవారం, 4 సెప్టెంబరు 2017 (13:14 IST)
తెలుగు అగ్ర హీరోయిన్లలో అనుష్క ఒకరు. ఇప్పటికే తెలుగు సినీపరిశ్రమలో దూసుకెళుతూ లక్షలాదిమంది ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటోంది అనుష్క. బాహుబలి సినిమాతో మరింత క్రేజ్ సంపాదించుకున్న అనుష్క... భాగమతి చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావస్తోంది. ఇకపోతే అనుష్క హీరోయిన్‌కు ప్రాధాన్యత ఉన్న క్యారెక్టర్లే చేయాలంటోందట. భాగమతి కూడా ఇదే తరహాలో ఉండటంతో ఒప్పుకుందట. 
 
ఎదిగినకొద్దీ ఒదగమని అంటుంటారు మన పెద్దలు. కానీ అది అనుష్కకు ఏ మాత్రం ఇష్టం లేనట్లుంది. ఎందుకంటే సినిమా అంటే హీరోలే. హీరోల ఫైట్లు, హీరోల డ్యాన్సులు ఇదంతా వారు చేస్తేనే బాగుంటుంది అంటుంటారు. కానీ హీరోలకు తానేమీ తగ్గదన్నట్లు మాట్లాడుతోందట అనుష్క. అందుకే రెండు సినిమాలను కూడా ఇలాంటి సమస్యతోనే వదిలేసిందట. 
 
ఆ సినిమాల్లో నటిస్తున్నవారు అగ్రహీరోలు కాగా... ఎవరైతే నాకేంటి.. నాకు కావాల్సింది హీరోయిన్ ప్రాధాన్యత కథ.. అది ఉంటే రండి.. లేకుంటే అవసరం లేదు. నాకు సినిమా అవకాశాలు చాలానే వస్తాయి. కానీ నాకు నచ్చింది.. నేను చేయాలి కదా. మీరు చెప్పినవన్నీ చేసుకుంటూ పోతే ఎలా.. అంటూ డైరెక్టర్లను ప్రశ్నిస్తోందట. మరి అనుష్కను పెట్టి ఎన్ని హీరోయిన్ ప్రాధాన్యత సినిమాలను డైరెక్టర్లు తీస్తారో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ముఖంపై ద్రవం పోసిన వ్యక్తి

తెలంగాణలో రూ. 200 కోట్ల భారీ అవినీతి తిమింగలం నిఖేష్, ఏసీబి సోదాలు

విశాఖపట్నంలో జరిగిన కేబెల్ స్టార్ సీజన్ 3 విజేతలను ప్రకటించిన ఆర్ఆర్ కేబెల్

జనవరి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు : మంత్రి నారాయణ

ప్రియుడితో ప్రేమకు నిరాకరించిన తల్లిదండ్రులు.. మనస్తాపంతో..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments