Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజు వెంటపడ్డ అనుపమ.. ఎందుకు?

నిర్మాత దిల్ రాజుకు అదృష్టం బాగా కలిసొచ్చినట్లుంది. ఏ సినిమా చేసినా సూపర్ హిట్టే. తను ఖర్చు పెట్టినదానికన్నా నాలుగింతల డబ్బు వచ్చిపడుతోంది దిల్ రాజుకు. కొత్త హీరోహీరోయిన్లయినా సరే దిల్ రాజుకు కాసుల వర్షం కురుస్తోంది. వరుస సినిమా విజయాలతో దిల్ రాజు టా

Webdunia
బుధవారం, 27 డిశెంబరు 2017 (19:39 IST)
నిర్మాత దిల్ రాజుకు అదృష్టం బాగా కలిసొచ్చినట్లుంది. ఏ సినిమా చేసినా సూపర్ హిట్టే. తను ఖర్చు పెట్టినదానికన్నా నాలుగింతల డబ్బు వచ్చిపడుతోంది దిల్ రాజుకు. కొత్త హీరోహీరోయిన్లయినా సరే దిల్ రాజుకు కాసుల వర్షం కురుస్తోంది. వరుస సినిమా విజయాలతో దిల్ రాజు టాప్‌టెన్ నిర్మాతల్లో ఒకరైపోయారు. ఇప్పుడు దర్శకుల వెంట కన్నా నిర్మాతల వెంట ఎక్కువగా హీరోయిన్లు పడి అవకాశాల కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. అందులో హీరోయిన పరమేశ్వరన్ ఒకరు. 
 
శతమానంభవతి చిత్రంతో కుటుంబ కథా నేపథ్యంలో నటించిన అనుపమ పరమేశ్వరన్‌కు ఆ సినిమాతో మంచి పేరొచ్చింది. ఆ సినిమాకు దిల్ రాజే నిర్మాత. పచ్చటి పల్లెటూరి వాతావరణంలో చిత్రీకరించిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ తరువాత ఉన్నది ఒక్కటే జిందగీ..మరికొన్ని సినిమాలు చేస్తున్న అనుపమ పరమేశ్వరన్‌కు హిట్ మాత్రం లభించలేదు. 
 
కానీ ఆ తరువాత దిల్ రాజు తీస్తున్న సినిమాలు మాత్రం భారీ విజయాలనే సాధించాయి. దీంతో అనుపమ దిల్ రాజు వెనుక పడిందని తెలుగు సినీవర్గాలు చెబుతున్నాయి. ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమా అయినా ఫర్వాలేదు. నాకు మీ సినిమాలో అవకాశం కావాలంటూ దిల్ రాజును పీడిస్తోంది అనుపమ. అయితే అనుపమతో మంచి స్నేహితురాలిగా భావించే దిల్ రాజు కథను బట్టి హీరోయిన్‌ను సెలక్ట్ చేస్తారు దర్శకులు. ఒకవేళ నీకు సూటయ్యే కథ వస్తే మాత్రం నువ్వే అందులో హీరోయిన్ అంటూ హామీ ఇచ్చి పంపేశాడట దిల్ రాజు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మద్యం మత్తులో 68 యేళ్ల అత్తపై అల్లుడి లైంగికదాడి..

ధరాలి పర్వత గ్రామంలో సహాయక చర్యలు.. ఒకరు మృతి 150మంది సేఫ్

రైల్వే ట్రాక్ సమీపంలో మృతదేహం.. చెవిలో హెర్బిసైడ్ పోసి హత్య.. ఎవరిలా చేశారు?

ఘర్షణపడిన తండ్రీకుమారులు.. ఆపేందుకు వెళ్లిన ఎస్ఎస్ఐ నరికివేత

Hyderabad: పేషెంట్‌ను పెళ్లి చేసుకున్న పాపం.. మానసిక వైద్యురాలు బలవన్మరణం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments