Webdunia - Bharat's app for daily news and videos

Install App

రెండో భార్యకు విడాకులు ఇచ్చిన బబ్లూ పృథ్వీరాజ్?

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2023 (14:12 IST)
Prithiveeraj
సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా నటించారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెర సీరియల్స్‌లో కూడా నటించాడు. 
 
అవకాశాల్లేక వెనుదిరిగిన ఈ నటుడు ఇప్పుడు మళ్లీ వేగం పెంచాడు. ఈరోజు విడుదలైన యానిమల్ సినిమాలో కూడా కీలక పాత్రలో నటించాడు. దయా వెబ్ సిరీస్‌తో ఓటీటీలోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. పృథ్వీరాజ్ వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగత విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నాడు. అతను 1994లో బీనాను వివాహం చేసుకున్నాడు.
 
అహద్ మోహన్ జబ్బార్ అనే కుమారుడు ఉన్నాడు. దాదాపు ఆరేళ్ల పాటు విడివిడిగా జీవించిన వీరిద్దరూ గతేడాది విడాకులు తీసుకున్నారు. అదే ఏడాది బబ్లూ శీతల్‌కు దగ్గరయ్యాడు. ఆమె తెలుగమ్మాయి. ఆమె బబ్లూ కంటే 30 ఏళ్లు చిన్నది. ఆమె తన జీవితాన్ని నటుడితో గడపాలని కోరుకుంది.
 
గతేడాది నవంబర్‌లో వీరి వివాహం జరిగినట్లు తెలుస్తోంది. అయితే ఇంతలోనే వీరి మధ్య విబేధాలు ఏర్పడిందని ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. బబ్లూ తనకు ప్రపోజ్ చేస్తున్న వీడియోను శీతల్ తొలగించడంతో ఈ పుకార్లు మరింత బలపడుతున్నాయి. ఇది ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TDP: ఐదు నెలల జీతాన్ని భారత సైన్యానికి విరాళంగా ఇచ్చిన టీడీపీ మహిళా ఎమ్మెల్యే

సూది గుచ్చకుండానే రక్త పరీక్ష ఎలా? నిలోఫర్ ఆస్పత్రి ఘనత!

తెలంగాణ రాజ్ భవన్‌లో చోరీ ఆ టెక్కీ పనేనంటున్న పోలీసులు!

పాక్‌లోని ప్రతి అంగుళం మా గురిలోనే ఉంది.. దాడి చేస్తే కలుగులో దాక్కోవాల్సిందే : ఎయిర్ డిఫెన్స్ డీజీ

గూఢచర్య నెట్‌వర్క్‌పై ఉక్కుపాదం.. ఇప్పటికే 12 మంది అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments