Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాంకర్ ప్రదీప్‌ది పైత్యమా...? పెళ్లి కుమార్తెల కోసం 'పెళ్లికాని ప్రసాదు'లు పోటీపడుతుంటే...

ఈ మధ్య టివిలో ఓ ప్రకటన వచ్చింది. యాంకర్‌ ప్రదీప్‌ పెళ్లి చేసుకోబోతున్నాడట. ఎక్కడికి వెళ్లినా… పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారట. ఎవరి పెళ్లికి వెళ్లినా… తరువాత నీ పెళ్లేనా అని అడుతున్నారట. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన ప్రదీప్‌ మహాశయుడు…

Webdunia
శనివారం, 28 జులై 2018 (16:54 IST)
ఈ మధ్య టివిలో ఓ ప్రకటన వచ్చింది. యాంకర్‌ ప్రదీప్‌ పెళ్లి చేసుకోబోతున్నాడట. ఎక్కడికి వెళ్లినా… పెళ్లి ఎప్పుడు అని అడుగుతున్నారట. ఎవరి పెళ్లికి వెళ్లినా… తరువాత నీ పెళ్లేనా అని అడుతున్నారట. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చిన ప్రదీప్‌ మహాశయుడు…. ’నాకు అన్నీ ఇచ్చిన టివి… పెళ్లి కూతుర్ని ఇవ్వకపోతుందా’ అంటూ టివి షో ద్వారానే… తనకు తగిన జోడీకి ఎంపిక చేసుకునే ఒక వింత, వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దానికి సంబంధించిన ప్రకటనే అది. ఎవరైనా అమ్మాయి తాను ప్రదీప్‌కు తగిన జోడీ అని భావిస్తుంటే…. ఓ వెబ్‌సైట్‌ ద్వారా పేరు నమోదు చేసుకోవాలి. 
 
ఈ కార్యక్రమం ఎలా వుంటుందో తరువాత ప్రకటిస్తారు. మా టివిలో ప్రసారం కానున్న కార్యక్రమంపై ఇప్పటిదాకా ఎవరూ పెద్దగా స్పందించలేదు గానీ… ప్రసారం మొదలయ్యాక ఈ షో విమర్శలు ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు రాజులు యువరాణికి వివాహం చేయాలంటే స్వయంవరం ప్రకటించేవారు. రాజులు ఆ స్వయంవరంలో పాల్గొని, యువరాణిని మెప్పించాలి. అలా మెప్పించిన వారిని యువరాణి పరిణయమాడుతుంది. దీనికి రివర్స్‌లో ఉంది ప్రదీప్‌ వ్యవహారం. తనకు నచ్చిన యువతిని ఎంపిక చేసుకోవడం కోసం ‘స్వయంవరం’ నిర్వహిస్తున్నారు.
 
తన పెళ్లికూతురు షోకు యువతులు పొలోమంటూ వస్తారన్నది ప్రదీప్‌ అంచనా కావచ్చు. అసలు అమ్మాయి ఇంటికి వెళ్లి పెళ్లిచూపులు చూడటాన్ని తప్పుబడుతూ దశాబ్దాల క్రితమే అనేక సినిమాలు వచ్చాయి. అమ్మాయిలు ఏమైనా సంతలో పశువులా అని ప్రశ్నిస్తున్నవారూ ఉన్నారు. అలాంటిది ప్రదీప్‌ బహిరంగంగా, టివి షో వంటిది నిర్వహించడం ద్వారా అమ్మాయిని ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నారు.
 
ప్రదీప్‌కు టివి కార్యక్రమాలు ఎనలేని గౌరవాన్ని, హోదాని తెచ్చిపెట్టాయన్నమాట వాస్తవమే. తన వ్యక్తిగత అంశాన్ని కూడా టివికి ఎక్కించాలనుకోవడం సృజనాత్మకత అనుకోవాలో లేక పైత్యం అనుకోవాలో తెలియడం లేదన్నది పలువురి వ్యాఖ్య.

సంబంధిత వార్తలు

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

సంసారం ఎలా సాగుతుందని అడిగేవారు.. పక్కన కూర్చోకపోతే..?

ఆగస్టు 15లోగా రైతుల 2 లక్షల పంట రుణాల మాఫీ.. ఏర్పాట్లు ఆరంభం

41 రోజుల రాజశ్యామల సహస్ర చండీయాగంలో జగన్

పాఠ్యపుస్తకాల మందం తగ్గింది.. ఈసారి ఆ ఇబ్బంది వుండదు..

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments