Webdunia - Bharat's app for daily news and videos

Install App

అందాలను ఆరబోయాలి కానీ అన్నీ చూపిస్తే ఎలా అన్నారట అనసూయను...

బుల్లితెర యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది అనసూయ. జబర్దస్త్‌తో కుర్రకారును హోరెత్తించిన ఈ అందాల భామ ఆ తరువాత అడపాదడపా సినిమాల్లోను నటించింది. చేసిన సినిమాల్లోను తన ప్రతిభను కనబరిచి అందరినీ ఆకట్టుకుంది. నాగార్జునతో మూడవ హీరోయిన్‌గా చేసిన అన

Webdunia
శుక్రవారం, 7 జులై 2017 (12:29 IST)
బుల్లితెర యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకతను సంపాదించుకుంది అనసూయ. జబర్దస్త్‌తో కుర్రకారును హోరెత్తించిన ఈ అందాల భామ ఆ తరువాత అడపాదడపా సినిమాల్లోను నటించింది. చేసిన సినిమాల్లోను తన ప్రతిభను కనబరిచి అందరినీ ఆకట్టుకుంది. నాగార్జునతో మూడవ హీరోయిన్‌గా చేసిన అనసూయను చూసిన ప్రేక్షకులు ముక్కున వేలేసుకున్నారు. పెళ్ళయి ఒక కొడుకున్న అనసూయలో ఏ మాత్రం గ్లామర్ తగ్గిపోలేదని తెలుగు సినీవర్గాలు చెవులు కొరుక్కున్నాయి. అయితే ఆ తరువాత అనసూయకు పెద్దగా సినిమాల్లో ఛాన్సులు రాలేదు. కారణం ఆమె దర్శకులు చెప్పినట్లుగా చేయకపోవడం వల్లనేనట. 
 
సినిమా అంటేనే చాలామంది కుర్రకారు హీరోయిన్ల నుంచి సైడ్ ఆర్టిస్టుల నుంచి అందాలను చూసేందుకు ఇష్టపడతారు. ఇక అనసూయ లాంటి వారి గురించి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు. అలాంటి అనసూయ సినిమాల్లో నటిస్తుండటంతో హాట్ హాట్ సీన్లు ఉండాలనుకుంటుంటారు ప్రేక్షకులు. అయితే ఆ హాట్ సీన్లకు ఏ మాత్రం ఒప్పుకోలేదట అనసూయ. నాగార్జునతో నటించిన సినిమాలోనే ఓణీ ధరించిన ఈ అమ్మడు ఆ తరువాత కుటుంబ సభ్యుల నుంచి క్లాస్ తీసుకుందట. అందాలను ఆరబోయాలి కానీ అన్నీ చూపిస్తే ఎలా అని ప్రశ్నించారట. దీంతో అనసూయ తనకంటూ కొన్ని హద్దులు పెట్టుకుందట. 
 
బికినీలు అస్సలు వేసుకోకూడదని, దాంతో పాటు అందాలను అస్సలు ఆరబోయకూడదని. ఇలాంటి సీన్లలో నటించమని మాత్రం అడిగితే అలాంటి సినిమాలే తనకు అక్కర్లేదని చెబుతోందట. అందుకే అనసూయ తిరిగి బుల్లితెరకే పరిమితమైంది. ప్రస్తుతం బుల్లితెరల్లోనే ఎక్కువగా కనిపిస్తున్న అనసూయ వెండితెరలో కనిపించకుండా పోవడానికి ఇదే ప్రధాన కారణమట. మరి అనసూయ ఇలాగే కొనసాగితే వెండితెరకు దూరమవ్వాల్సిన పరిస్థితి తప్పదేమో..?
అన్నీ చూడండి

తాజా వార్తలు

జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు

ఆమె వయసు 36, ముగ్గురు పిల్లల తల్లి - ఇంటర్ విద్యార్థితో లేచిపోయింది...

Ambati Rayudu: పవన్‌కు ఇష్టం లేకున్నా.. ఏపీకి సీఎంను చేస్తా: అంబటి రాయుడు

పొరుగు రాష్ట్రాల మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదు: మంత్రి దురైమురుగన్

ఉద్యోగం పేరుతో నయా మోసం... ఫేక్ కంపెలీ పేరుతో ఆఫర్ లెటర్... రూ.2.25 లక్షలు వసూలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments