Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిస్సిగ్గుగా వారి కోసమే ఇలా అందంగా వచ్చానన్న అనసూయ భరద్వాజ్‌

Webdunia
సోమవారం, 11 సెప్టెంబరు 2023 (15:49 IST)
Anasuya Bharadwaj
యాంకర్‌ నటి అయ్యాక తన అందానికి ఇస్తున్న ప్రాధాన్యత అంతా ఇంతాకాదు. గ్లామర్‌ పాత్రలు చేయడానికి వెనుకాడని ఆమె రంగమ్మత్తగా రంగస్థలంలో కనిపించింది. ఆ తర్వాత పలు సినిమాలు చేస్తూ ప్రమోషన్‌లో భాగంగా బయటకు హాట్‌ డ్రెస్‌తో యూత్‌ను కలవపరిచేది. మిడ్డీ కూడా వేసుకుని ఆమధ్య ఓ ఫంక్షన్‌ కూడా అటెండ్‌ అయింది. అయితే ఈసారి ఆమె మోకాళ్ళు చినిగిపోయిన జీన్స్‌ ఫ్యాంట్‌, షర్ట్‌ వేసుకుని సోమవారంనాడు పెదకాపు`1 ఫంక్షన్‌కు అటెండ్‌ అయింది.
 
ఇందులో కూడా ఆమె మాస్‌ తరహాల పాత్ర పోషించింది. ఆమె స్టేజీపైకి ఎక్కగానే మగరాయుడిలా వున్నావని ఛోటాకెనాయుడు కామెంట్‌ చేస్తే, నేను అందంగా లేనా? అని పక్కవారిని అడిగింది. సూపర్ గా ఉన్నావ్ అన్నారు.. సరదాగా మాట్లాడుతూ, ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చింది ఛోటా వల్లనే. నీకు ఓ కంపెనీ నుంచి ఫోన్‌ వస్తుంది. ఎక్కువ మాట్లాడకుండా క్యారెక్టర్‌ వినమని చెప్పారని అంది. 
 
ఇక ఆ తర్వాత చోటా మాట్లాడుతూ,  ఈసారి ఫంక్షన్‌కు వస్తే ఇలా హై హిల్స్‌ వేసుకుని రామాకు. నువ్వు మాకంటే హైలెవల్‌లో కనిపిస్తున్నావ్‌. చినిగిన జీన్స్‌ ఏమిటి? అని సరదాగా చేసిన కామెంట్‌కు.. నేను ఇలా వచ్చింది ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఫాలోవర్స్‌ కోసమే అంటూ సెలవిచ్చింది. ఇలా ప్రతీసారి సోషల్‌ మీడియాలో వైలర్‌ కావడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇటీవలే ఓ డ్రెస్‌లో ఇన్‌స్ట్రాలో పోస్ట్‌ చేస్తే, చాలా మంది నెటిజన్లు ఆంటీ! అని సంబోధించారు. ఈసారి నేను గ్లామర్‌ గాళ్‌గా కనిపిస్తున్నానుగదా! అంటూ ఆమెకు ఆమే మెచ్చుకుంది. మరి నెటిజన్లు ఏమంటారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments