Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సర్కార్' హక్కులు నా సొంతం.. నీవెలా సీక్వెల్ తీస్తావ్.. రాంగోపాల్ వర్మకు లీగల్ నోటీసు

రాంగోపాల్ వర్మ వివాదాలకు పెట్టింది పేరు. సినిమాలు కూడా అంతే కేవలం వివాదాలు ఉన్నవి మాత్రమే ఎంచుకుని సినిమాలుగా తీస్తారు. ఎక్కడ ఏమి సంచలనం అయినా దానిని సినిమాగా తీస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తారు. మొన్న నయ

Webdunia
గురువారం, 27 అక్టోబరు 2016 (09:29 IST)
రాంగోపాల్ వర్మ వివాదాలకు పెట్టింది పేరు. సినిమాలు కూడా అంతే కేవలం వివాదాలు ఉన్నవి మాత్రమే ఎంచుకుని సినిమాలుగా తీస్తారు. ఎక్కడ ఏమి సంచలనం అయినా దానిని సినిమాగా తీస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తారు. మొన్న నయీం ఎన్‌కౌంటర్ కాగానే అయన పేరుపై మూడు భాగాలలో సినిమా తీస్తా అని ప్రకటించారు. అంతకుముందు తీసిన బ్రూస్ లీ సినిమా ఏమైందో ఎవ్వరికి తెలియదు. నిన్న ''వంగవీటి'' సినిమా తీశారు. 
 
ఇప్పుడు తాజాగా మరో వివాదానికి తెరతీశారు. వర్మ తాజా చిత్రం "సర్కార్ 3''. సర్కార్ రాజ్ సినిమాలతో ఇప్పటికే ఘన విజయం సాధించిన వర్మ ఆ వరుసలో తీస్తున్న మూడో చిత్రమిది. అయితే, సర్కార్‌కు సీక్వెల్ నిర్మించే హక్కు వర్మకు లేదంటూ నరేంద్ర హిరావత్ అనే నిర్మాత నోటీసులు పంపించాడు. 
 
సర్కార్ సినిమాకు చెందిన హక్కులన్నీ తనవేనని, సీక్వెల్ తీయాలన్నా, రీమేక్ చేయాలన్నా తన అనుమతి తీసుకోవాల్సిందే అని నోటీసులో వెల్లడించాడు. తనను సంప్రదించకుండానే రాంగోపాల్ వర్మ సర్కార్ 3 సినిమా స్టార్ట్ చేశాడని, వెంటనే తనతో మాట్లాడకపోతే వర్మపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. అయితే ఇలాంటి వివాదాలు వర్మకు సర్వసాధారణం. మరి ఈ హెచ్చరికలకు వర్మ స్పందిస్తాడా.. లేదా తనదైనశైలిలో డీల్ చేస్తాడాని వేచిచూడాల్సిందే. 

కాలిలో పెట్టిన ప్లేట్లు తొలగించాలని యువతి ఆస్పత్రికి వెళ్తే.. మత్తు వికటించిందని..?

విశాఖలో జూన్ 9న జగన్ సీఎంగా రెండోసారి ప్రమాణం, సిద్ధంగా వుండండి

భర్తను రౌడీషీటర్‌తో హత్య.. గుండెపోటుతో చనిపోయాడని నమ్మించింది.. చివరికి?

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments