Webdunia - Bharat's app for daily news and videos

Install App

'రైతు' కోసమే అమితాబ్‌ను కలిశాడు... బాలయ్య చిత్రానికి గ్రీన్ సిగ్నల్

ప్రముఖ దర్శకుడు కష్ణవంశీ దర్శకత్వంలో బాలకష్ణ కథానాయకుడుగా నటించే భారీ చిత్రం 'రైతు'లో నటించడానికి బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో అమితాబ్

Webdunia
శుక్రవారం, 21 అక్టోబరు 2016 (18:35 IST)
ప్రముఖ దర్శకుడు కష్ణవంశీ దర్శకత్వంలో బాలకష్ణ కథానాయకుడుగా నటించే భారీ చిత్రం 'రైతు'లో నటించడానికి బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రలో అమితాబ్‌ లాంటి స్టేచర్‌ ఉన్న నటుడు నటిస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో బాలకష్ణ, కష్ణవంశీ వెళ్ళి ఆయనను కలిశారు. నందమూరి కుటుంబం పట్ల ఉన్న అభిమానంతోనూ, చిత్రంలోని పాత్ర నచ్చడంతోను ఈ సినిమాలో నటించడానికి అమితాబ్‌ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
 
ఈ సినిమా కోసం ఫిబ్రవరి నెలలో 17 రోజుల కాల్‌ షీట్స్‌ కూడా ఆయన అప్పుడే కేటాయించినట్టు సమాచారం. దీంతో ముందుగా అమితాబ్‌ వుండే సన్నివేశాలను చిత్రీకరించడానికి దర్శకుడు ప్లాన్‌ చేస్తున్నాడట. గతంలో 'మనం' సినిమాలో అమితాబ్‌ కాసేపు కనిపించినప్పటికీ, ఒక తెలుగు సినిమాలో ఆయన పూర్తి నిడివి పాత్ర పోషించడం మాత్రం ఇందులోనే అని చెప్పచ్చు. ఏమైనా, ఈ బాలీవుడ్‌ దిగ్గజం 'రైతు' సినిమాలో భాగం కావడంతో ఈ సినిమా స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలియకుండానే పహల్గాం ఉగ్రదాడిని వీడియో తీసిన టూరిస్ట్ (Video)

దారుణం, వెనుక తూటాలకు బలవుతున్న పర్యాటకులు, ఆకాశంలో కేరింతలు కొడుతూ వ్యక్తి (video)

సరిహద్దులకు చైనా శతఘ్నలను తరలిస్తున్న పాకిస్థాన్ - అప్రమత్తమైన భారత్!!

పెద్దపల్లిలో యువకుడి దారుణ హత్య (Video)

Asaduddin Owaisi, మీరు చంపుతుంటే మౌనంగా వుండాలా?: పాకిస్తాన్ పైన అసదుద్దీన్ ఆగ్రహం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments