Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ "డీజే"కు బ్రేక్.. పెద్ద నోట్ల రద్దే కారణమా?

అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "డీజే.. దువ్వాడ జగన్నాథం". ఈ చిత్రంలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా పూర్త

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (10:47 IST)
అల్లు అర్జున్ హీరోగా హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "డీజే.. దువ్వాడ జగన్నాథం". ఈ చిత్రంలో బన్నీ సరసన పూజ హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ కూడా పూర్తి అయ్యింది. ఇంతలోనే ఈ చిత్రం షూటింగ్‌కు పూర్తిగా బ్రేక్ పడినట్టు ఫిల్మ్ నగర్‌లో వార్తలు వస్తున్నాయి. నెలరోజుల పాటు బన్ని షూటింగ్‌కి దూరం కాబోతున్నాడు. 
 
నిజానికి ఇటీవల బన్ని-స్నేహా రెడ్డి దంపతులకి పాప పుట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ నెల రోజుల పాటు షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చి.. ఫ్యామిలీతో గడపాలని బన్ని నిర్ణయించుకొన్నట్టు సమాచారం. దీంతో షూటింగ్‌కి కంఫ్లీట్ గా బ్రేక్ ఇవ్వకుండా.. బన్ని లేని సన్నివేశాలని మాత్రమే చిత్రీకరించేందుకు నిర్మాత, దర్శకుడు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
 
అయితే, ఫిల్మ్ నగర్‌లో వాదన వినిపిస్తోంది. దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ఈ చిత్ర షూటింగ్‌కు అంతరాయం ఏర్పడినట్టు తెలుస్తోంది. చిత్ర షూటింగ్ కోసం డబ్బులు ఖర్చు విషయంలో నిర్మాత ఆచితూచి అడుగులు వేస్తున్నారనే వదంతలు వినిపిస్తున్నాయి. అందువల్లే చిత్రం షూటింగ్‌కు బ్రేక్ వేసినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అన్నీ చూడండి

తాజా వార్తలు

BMW Hits Auto Trolley: ఆటో ట్రాలీని ఢీకొన్న బీఎండబ్ల్యూ కారు.. నుజ్జు నుజ్జు.. డ్రైవర్‌కి ఏమైందంటే? (video)

తలపై కత్తిపోట్లు, నోట్లో యాసిడ్ పోసాడు: బాధతో విలవిలలాడుతున్న బాధితురాలిపై అత్యాచారం

దువ్వాడ శ్రీనివాస్, దివ్యల మాధురిల వాలెంటైన్స్ డే వీడియో- ఒక్కరోజు భరించండి (Video)

వదినతో టెక్కీ అక్రమ సంబంధం... ఆ మెసేజ్ చూడగానే మరిదికి కోపం కట్టలు తెంచుకుంది.. అంతే...

దువ్వాడకు మాధురి ముద్దులు: ఈమెను పరిచయం చేసింది నా భార్యే అంటున్న శ్రీనివాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహం వ్యాధికి మెంతులు అద్భుతమైన ప్రయోజనాలు

మునగ ఆకుల టీ ఒక్కసారి తాగి చూడండి

దొండ కాయలు తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

హైదరాబాద్ వేడి వాతావరణం, భౌగోళిక పరిస్థితులు డీహైడ్రేషన్ ప్రమాదంలో పడేస్తున్నాయి: హెచ్చరిస్తున్న నిపుణులు

బీట్ రూట్ జ్యూస్ ఉపయోగాలు

తర్వాతి కథనం
Show comments