Webdunia - Bharat's app for daily news and videos

Install App

డైరెక్టర్‌కి కథ వినిపించిన అల్లు అర్జున్... ప్లాన్ అదిరింది..!

Webdunia
బుధవారం, 28 నవంబరు 2018 (12:59 IST)
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ అయిన త‌ర్వాత క‌థ‌ల విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడు. ఏదో సినిమా చేసేయాల‌ని కాకుండా సరైన క‌థ‌తోనే రావాల‌ని చూస్తున్నాడు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌నున్నాడు అని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తోన్న విష‌యం తెలిసిందే. క‌థ విష‌యంలో త్రివిక్ర‌మ్‌తో చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. అయితే.. బ‌న్నీ ఈసారి సినిమా సినిమాకి గ్యాప్ లేకుండా అభిమానుల‌ను ఎంట‌ర్టైన్ చేయ‌డం కోసం మ‌రో సినిమాని కూడా లైన్లో పెట్ట‌బోతున్నాడ‌ట‌.
 
ఇంత‌కీ మ‌రో సినిమా ఎవ‌రితో అంటారా..? ఇటీవ‌ల త‌మిళ రైట‌ర్ బ‌న్నీకి ఓ క‌థ చెప్పార‌ట‌. ఈ క‌థ బ‌న్నీకి చాలా బాగా న‌చ్చేసింద‌ట‌. ఈ క‌థ‌ను విక్ర‌మ్ కుమార్‌కి వినిపించార‌ట‌. ఈ క‌థ‌ను డైరెక్ట్ చేస్తారా అని అడిగార‌ట‌. విక్ర‌మ్ కుమార్ వేరే క‌థ‌తో త‌ను సినిమా చేయ‌డ‌మా అని ఆలోచ‌న‌లో ప‌డ్డాడ‌ట కానీ.. బ‌న్నీతో ఎప్ప‌టి నుంచో ట్రావెల్ అవుతుండ‌టంతో కాద‌నలేక ఓకే చెప్పాడ‌ట‌. సో.. ఈ విధంగా ఫ్యాన్స్‌ని ఎంట‌ర్టైన్ చేయాలి అని ప‌క్కా ప్లాన్‌తో వ‌చ్చేందుకు రెడీ అవుతున్న బ‌న్నీ ప్లాన్ అదిరింది క‌దా..!

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాంగ్రెస్ ఎమ్మెల్యేనా మజాకా... వెండితో బెడ్ మంచం... (Video)

వైద్యం వికటించి తండ్రి మృతి.. ప్రశ్నించిన కుమార్తెను కొట్టి చంపేసిన వైద్యుడు.. ఎక్కడ?

మోడీ మాస్టర్ ప్లాన్.. బీజేపీలో వైకాపా విలీనం!!?

మాలీలో ఘోరం.. బంగారు గనిలో దుర్ఘటన - 10 మంది కూలీలు మృతి

నా తోట సరే... పక్కనే చంద్రబాబు తోట కూడా వుందిగా, దాని సంగతేంటి? పెద్దిరెడ్డి జస్ట్ ఆస్కింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments