Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇలియానా-తమన్నా నడుములు భలేగుంటాయ్.. చీరలో తమ్మూను చూస్తే.. సమంత కూడా?: బన్నీ

ఆర్య హీరోయిన్ కాజల్ వెస్ట్రన్ డ్రెస్సుల్లో బాగుంటుందని, ఇలియానా కూడా వెస్ట్రన్ డ్రెస్సుల్లో అదిరిపోతుందని అల్లు అర్జున్ కామెంట్ చేశాడు. జులాయి సినిమా షూటింగ్ విదేశాల్లో చేసినప్పుడు.. షూటింగ్ పూర్తయ్యా

Webdunia
బుధవారం, 21 జూన్ 2017 (15:44 IST)
దువ్వాడ జగన్నాథం (డీజే) రిలీజ్‌కు ముందే పాజిటివ్ టాక్ రావడంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఖుషీ ఖుషీగా ఉన్నాడు. దువ్వాడ జగన్నాథం సినిమా ప్రమోషన్‌లో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ల అందాలపై బన్నీ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. డీజే హీరోయిన్ పూజా హెగ్డే షార్ట్స్‌లో చాలా అందంగా ఉంటుందని చెప్పాడు. ఆమె ఎత్తుకు షార్ట్స్ చాలా బాగుంటాయని.. షార్ట్స్ ఆమెకు బాగా సూట్ అవుతాయని కితాబిచ్చాడు. డీజే సినిమా పాటల్లో షార్ట్స్‌లో పూజా హెగ్డే డాన్స్ చేసేందుకు చాలా కష్టపడిందని అల్లు అర్జున్ వెల్లడించాడు. 
 
ఇక ఆర్య హీరోయిన్ కాజల్ వెస్ట్రన్ డ్రెస్సుల్లో బాగుంటుందని, ఇలియానా కూడా వెస్ట్రన్ డ్రెస్సుల్లో అదిరిపోతుందని అల్లు అర్జున్ కామెంట్ చేశాడు. జులాయి సినిమా షూటింగ్ విదేశాల్లో చేసినప్పుడు.. షూటింగ్ పూర్తయ్యాక తన బట్టలు వేసుకుని వెళ్లిందని, ఆ డ్రెస్సులో ఇలియానా అందంగా కనిపించిందని చెప్పుకొచ్చాడు. ఇలియానా నడుమే కాదు.. తమన్నా నడుము కూడా బాగుంటుందని అల్లు అర్జున్ తెలిపాడు. ఇంకా తమన్నా చీరలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నాడు. మరో టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత చీరలోనే కాదు.. వెస్ట్రన్ డ్రెస్సుల్లో కూడా బాగుంటుందని బన్నీ హీరోయిన్ అందాలపై కామెంట్లు చేశాడు. 
 
ఇక సోషల్ మీడియాలో మెగాస్టార్ హోదాపై బన్నీ కన్నేశాడని వస్తున్న కామెంట్లపై అల్లు అర్జున్ స్పందిస్తూ.. మెగాస్టార్ చిరంజీవి దరిదాపులకు కూడా మెగా హీరోలెవరూ వెళ్లలేరని అల్లు అర్జున్ తెలిపాడు. చిరంజీవి సాధించిన దానిలో పది శాతం కూడా తాము సాధించలేమని బన్నీ చెప్పాడు. కనీసం ఆయనను అనుకరించే సాహసం కూడా చేయనని.. మెగా వారసుల్లో ఎవరి స్టైల్ వారికి ఉంటుందని అన్నాడు. 
 
ఎవరిని ఎవరూ అనుకరించరని, కేవలం అనుసరిస్తారని చెప్పాడు. కేవలం మెగా ఫ్యామిలీలో వారికే కాదు, ప్రతి ఒక్కరికీ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పాడు. అలా ఉంటే ఇండివిడ్యువాలిటీ ఉంటుందని అల్లు అర్జున్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక తండ్రిగా అల్లు అరవింద్ అద్భుతమైన వ్యక్తి అని కితాబిచ్చాడు. తాను తండ్రిగా ఆయన దరిదాపుల్లోకి కూడా వెళ్లలేనని చెప్పాడు. ఇక కొడుకుగా అయాన్ కంటే కూడా అల్లు అర్జున్ చాలా అల్లరి పిల్లాడని తెలిపాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

చొరబాటుకు యత్నం.. పాక్ ముష్కరుల కాల్చివేత!

జగన్‌తో స్నేహం .. గాలికి జైలు శిక్ష - ఎమ్మెల్యే పదవి కూడా పాయె...

పాక్‌కు పగటిపూటే చుక్కలు... యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్‌తో మిలిటరీ పోస్ట్‌ను ధ్వంసం (Video)

భారత్ పాకిస్థాన్ యుద్ధం : విమాన ప్రయాణికులకు అలెర్ట్

దేశం కోసం ఏమైనా చేస్తాం : ముఖేశ్ అంబానీ - గౌతం అదానీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments