Webdunia - Bharat's app for daily news and videos

Install App

'బాహుబ‌లి' రికార్డును తిరగరాసిన అజిత్ "వివేగం"

భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని పాత, కొత్త రికార్డులన్నింటినీ తిరగరాసిన చిత్రం "బాహుబలి-1", "బాహుబలి-2". అలాంటి చిత్ర రికార్డును తమిళ హీరో చిత్రం బ్రేక్ చేసింది. ఆ చిత్రం పేరు పేరు "వివేగం". తమిళంలో సూపర్

Webdunia
సోమవారం, 28 ఆగస్టు 2017 (20:26 IST)
భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని పాత, కొత్త రికార్డులన్నింటినీ తిరగరాసిన చిత్రం "బాహుబలి-1", "బాహుబలి-2". అలాంటి చిత్ర రికార్డును తమిళ హీరో చిత్రం బ్రేక్ చేసింది. ఆ చిత్రం పేరు పేరు "వివేగం". తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్‌ తర్వాత అంతటి ఫాలోయింగ్ ఉన్న హీరోగా అజిత్ కుమార్ పేరుంది. 
 
ఈయన తాజాగా నటించిన చిత్రం 'వివేగం' (తెలుగులో వివేకం). ఈ చిత్రం 'బాహుబలి' రికార్డును కూడా బ‌ద్ద‌లుకొట్టింది. త‌మిళ‌నాడులో ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. చెన్నై వ‌ర‌కు తీసుకుంటే ఈ మూవీ 'బాహుబ‌లి 2'ని కూడా వెన‌క్కి నెట్టేసింది. 
 
'బాహుబ‌లి 2' తొలి మూడు రోజుల్లో రూ.3.24 కోట్లు వ‌సూళ్లు రాబ‌ట్ట‌గా.. వివేగం మూడు రోజుల్లో రూ.4.28 కోట్లు వ‌సూలు చేయ‌డం విశేషం. ఈ రికార్డుతో ఈ ఏడాది రిలీజైన బిగ్గెస్ట్ మూవీస్‌లో ఒక‌టిగా వివేగం నిలిచింది. ఆగ‌స్టు 24న రిలీజైన వివేగంలో త‌ల అజిత్‌తోపాటు వివేక్ ఒబెరాయ్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్‌, అక్ష‌ర హాస‌న్ లీడ్ రోల్స్‌లో నటించిన విషయం తెల్సిందే.
 
కాగా, 'బాహుబలి 2' విడుదలైన సమయంలో సినీ టిక్కెట్ ధర గరిష్టంగా రూ.120గా ఉంటే.. ఇపుడు ఇది రూ.150 నుంచి రూ.200 వరకు ఉంది. ఈ కారణంగానే అత్యధిక కలెక్షన్లను రాబట్టిందనే కామెంట్స్ లేకపోలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అద్దెకు ఉంటున్న యువతి బాత్రూమ్‌లో సీక్రెట్ కెమెరా... లైవ్‌లో చూస్తూ పైశాచికం...

హనీమూన్ ట్రిప్ పేరుతో ఘరానా మోసం... కొత్త జంటకు కుచ్చుటోపీ...

ఒక్క ఛాన్స్ వస్తే హోం మంత్రిని అవుతా.. ఆపై రెడ్ బుక్ ఉండదు.. బ్లడ్ బుక్కే : ఆర్ఆర్ఆర్

హిమాచల్ ప్రదేశ్ ఆగని వర్షాలు... వరదలకు 75 మంది మృతి

రూ.7.5 కోట్ల ఫెరారీ కారుకు రూ.1.42 కోట్ల పన్ను.. క్షణాల్లో చెల్లించిన కోటీశ్వరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments