Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగులో ఐశ్వర్యారాయ్ నటించనున్న తొలి పూర్తి చిత్రం ఏది.. చిరంజీవిదేనట..

సౌత్ సినిమాలు అంటే ఐశ్వర్య రాయ్‌కు అంత ఆసక్తి లేదనిపిస్తుంది. తెలుగులో అయితే ఒక్క నిర్మాతా ఆమెతో నటింపచేసే సాహసం చేయలేదింతవరకు. అలాంటిది ఇప్పుడు తాజాగా ఐశ్వర్యారాయ్‌ను ఎలాగోలా తెలుగు సినిమాలో నటిపజేసే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయని సమాచారం. అదికూ

Webdunia
గురువారం, 11 మే 2017 (02:59 IST)
బాలీవుడ్ దివా ఐశ్వర్యారాయ్ గత పదిహేనేళ్లలో దక్షిణాదిన కధానాయికగా చిత్రించిన సినిమాలు కేవలం రెండంటే రెండు. అవి కూడా తమిళ సినిమాలే. ఒకటి మణిరత్నం తీసిన రావన్, శంకర్ తీసిన రోబో. ఎందుకో ఏమో కానీ సౌత్ సినిమాలు అంటే ఐశ్వర్య రాయ్‌కు అంత ఆసక్తి లేదనిపిస్తుంది. తెలుగులో అయితే ఒక్క నిర్మాతా ఆమెతో నటింపచేసే సాహసం చేయలేదింతవరకు. అలాంటిది ఇప్పుడు తాజాగా ఐశ్వర్యారాయ్‌ను ఎలాగోలా తెలుగు సినిమాలో నటిపజేసే ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నాయని సమాచారం. అదికూడా అల్లాటప్పా హీరోల సరసన కాదు. మెగాస్టార్ చిరంజీవి సరసన ఆమెను జోడీగా తీసుకురావాలనుకుంటున్నారు. 
 
సౌత్‌ సినిమాల ఎంపికలో ఆచి తూచి వ్యవహరిస్తున్న ఐశ్వర్యను చిరంజీవికి జోడీగా తీసుకోవాలను కుంటున్నారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. చిరంజీవి హీరోగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో చిరు సరసన ఐశ్వర్య జంటగా నటించడం ఖాయమనే వార్తలు వస్తున్నాయి. 
 
అప్పుడెప్పుడో హీరోయిన్‌గా కెరీర్‌ స్టార్ట్‌ చేసిన కొత్తల్లో నాగార్జున ‘రావోయి చందమామ’లో ఐశ్వర ఓ ఐటమ్‌ సాంగ్‌ చేశారు. ఆ తర్వాత స్ట్రయిట్‌ తెలుగు సిన్మా చేయలేదు. ఇప్పుడీ సినిమాకు సైన్‌ చేస్తే హీరోయిన్‌గా ఆమె చేసే ఫస్ట్‌ స్ట్రయిట్‌ తెలుగు మూవీ అవుతుంది. ఇప్పటికే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమాతో సంచలనం రేపుతున్న చిరంజీవి సరసన ఐశ్వర్యా రాయ్ కథానాయికగా నటిస్తే బాక్స్ బద్దలు కావాల్సిందే అంటున్నారు అభిమానులు.
 

EVMను ధ్వంసం చేసిన వైసిపి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి - video

అమలాపురం మహిళ కడుపులో 570 రాళ్లు.. అవాక్కైన వైద్యులు!!

జూన్ 4న వచ్చే ఫలితాలతో జగన్ మైండ్ బ్లాంక్ అవుతుంది : ప్రశాంత్ కిషోర్

జూన్ 8వ తేదీ నుంచి చేప ప్రసాదం పంపిణీ

బోలారం ఆస్పత్రి.. బైకులో కూలిన చెట్టు.. వ్యక్తి మృతి

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments