Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ధనుష్ ప్లేబాయ్' కాదు.. మాది సినిమా ఫ్యామిలీ.. గాసిప్స్ నమ్మను : ఐశ్వర్య

'3' చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి దర్శకురాలిగా అడుగుపెట్టిన ఐశ్వర్య ఆ తర్వాత' వైరాజావై' చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం స్టంట్ కళాకారుల జీవిత ఇతివృత్తంతో 'సినిమా వీరన్' అనే లఘు చిత్రాన్ని రూపొం

Webdunia
బుధవారం, 26 అక్టోబరు 2016 (16:45 IST)
'3' చిత్రం ద్వారా కోలీవుడ్‌లోకి దర్శకురాలిగా అడుగుపెట్టిన ఐశ్వర్య ఆ తర్వాత' వైరాజావై' చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రస్తుతం స్టంట్ కళాకారుల జీవిత ఇతివృత్తంతో 'సినిమా వీరన్' అనే లఘు చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అదేవిధంగా తన తండ్రి సూపర్‌స్టార్ జీవిత చరిత్రను రాసి, దాన్ని వెండి తెరపై ఆవిష్కరించే పనిలోనూ బిజిబిజీగా ఉన్నారు. 
 
ఇదిలావుంటే... నా భర్త ఎలాంటి వారో నాకు బాగా తెలుసని సూపర్‌స్టార్ రజినీకాంత్ పెద్ద కూతురు, దర్శకురాలు ఐశ్వర్య ధనుష్ అంటున్నారు. కోలీవుడ్ హీరో ధనుష్ గురించి రకరకాల పుకార్లు షికార్లు చేశాయి. 'ధనుష్ ప్లేబాయ్' అని, కొందరు 'నటీమణులతో చెట్టాపట్టాల్' అంటూ వదంతులు కలకలం రేపాయి. అంతేకాదు ఇలాంటి వదంతుల కారణంగా కుటుంబంలో సమస్యలు తలెత్తినట్లు, చివరకు సూపర్ స్టార్ రజినీకాంత్ కలగజేసుకుని పరిస్థితిని చక్కదిద్దినట్లు కోలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. 
 
తన భర్తపై ప్రచారం అవుతున్న వదంతులకు ఐశ్వర్య తనదైనశైలిలో స్పందిస్తూ... తాను డాక్టర్‌నో, లాయర్‌నో అయివుంటే ఇలాంటి వదంతులకు ఆగ్రహించేదాన్ని... తనది సినిమా కుటుంబం అని, సినిమా గురించి తనకు పూర్తిగా తెలుసనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యంగా తన భర్త ధనుష్ గురించి, ఆయన ఎలాంటి వారో తనకు బాగా తెలుసన్నారు. ఇలాంటి పనికిమాలిన, అసత్య ప్రచారాల గురించి పట్టించుకోవలసిన అవసరమో, బాధపడాల్సిన పనోలేదని ఐశ్వర్య ధనుష్ స్పష్టం చేసినట్లు సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

Sonia Gandhi: నేషనల్ హెరాల్డ్ కేసు: సోనియా గాంధీ రూ.142 కోట్లు సంపాదించారా?

కదులుతున్న రైలు నుంచి సూట్‌కేస్ విసిరేసారు, తెరిచి చూస్తే శవం

Jagan: చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు? వైఎస్ జగన్ అరెస్ట్ కోసమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments