బిగ్ బాస్ షో ద్వారా విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్న వనిత.. వివాదాల ద్వారా అందరి నోళ్లల్లో నానింది. ఆపై ఆమెకు అవకాశాలు కూడా వెతుక్కుంటూ వస్తున్నాయి.
అయినా అవకాశాల కోసం వేచి చూడకుండా.. సొంతంగా వ్యాపారం ప్రారంభించి నడుపుతోంది. వనిత మూడో పెళ్లి సెన్సేషన్ కు దారితీసిన సంగతి తెలిసిందే.
ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ వుండే వనిత ప్రస్తుతం రకరకాల డ్రెస్ లతో గ్లామర్ ఫోటోలను నెట్టింట పోస్టు చేసింది.
ఈ ఫోటోలు చూసిన వారంతా వనితకు ఏమైందోనని అందరూ అయోమయంలో పడ్డారు. గ్లామర్ పేరుతో రకరకాల ఫోటోలను నెట్టింట పోస్టు చేసింది. ఈ ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.