Webdunia - Bharat's app for daily news and videos

Install App

దాపెట్టుకోవడం ఎంత తప్పో తెలిసింది.. అందుకే అందాలు ఆరబోస్తున్నా : రాశీఖన్నా

చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాక మన వద్ద ఉన్నదాన్ని ఏదీ దాచిపెట్టుకోరాదనీ, అలా దాచిపెట్టుకోవడం ఎంత తప్పో ఇపుడు తెలుస్తోందని సినీ నటి రాశీఖన్నా వ్యాఖ్యానిస్తోంది. ముఖ్యంగా, వెండితెరపై ఏదీ దాచి పెట్టుకోకు

Webdunia
బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (14:30 IST)
చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాక మన వద్ద ఉన్నదాన్ని ఏదీ దాచిపెట్టుకోరాదనీ, అలా దాచిపెట్టుకోవడం ఎంత తప్పో ఇపుడు తెలుస్తోందని సినీ నటి రాశీఖన్నా వ్యాఖ్యానిస్తోంది. ముఖ్యంగా, వెండితెరపై ఏదీ దాచి పెట్టుకోకుండా నటించాలనీ, ఉన్న అందాలన్నీ ఆరబోస్తేనే మంచి ఫలితం వస్తుందని గ్రహించినట్టు చెప్పుకొచ్చింది. 
 
తనకు వస్తున్న వరుస సినీ ఆఫర్లపై ఆమె స్పందిస్తూ... 'తొలినాళ్లలో నాకు నేనుగా కొన్ని పరిమితులు విధించుకొనేదాన్ని. నేనింతే చేయగలను, నాకు ఇది మాత్రమే తెలుసు అనుకొని ఆ మేరకే నిర్ణయాలు తీసుకొనేదాన్ని. కానీ ఒకొక్క సినిమా చేసేకొద్దీ ఆ అభిప్రాయం ఎంత తప్పో తెలిసిపోయింది. కొన్ని సినిమాల్లో నన్ను నేను చూసుకొనేంత వరకు కూడా నాలో అంత ప్రతిభ ఉందా అని నేను నమ్మలేకపోయినట్టు చెప్పింది. 
 
అందుకే ఈమధ్య ధైర్యంగా సవాళ్లని స్వీకరిస్తున్నా. నా సన్నిహితులకూ అదే ధైర్యం నూరిపోస్తున్నా. నటిగా ఇకపై ప్రతి సినిమాతోనూ ఓ మెట్టు పైకి ఎక్కగలననే ఆత్మవిశ్వాసం నాలో నాకు కనిపిస్తోంద'ని చెప్పుకొచ్చింది రాశిఖన్నా. త్వరలోనే ‘ఆక్సిజన్‌’తో సందడి చేయబోతున్న ఆమె తదుపరి ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లతో జోడీ కట్టబోతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

వెర్టిగో గురించి ఈ సోషల్ మీడియా అధ్యయనం కీలక భావనలను వెల్లడిస్తుంది!

పచ్చి ఉల్లిపాయలు తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments