Webdunia - Bharat's app for daily news and videos

Install App

దర్శకనిర్మాతలతో అడ్జెస్ట్ అయిన హీరోయిన్లకే బెస్ట్ ఫ్యూచర్ : బోల్డ్‌గా వెల్లడించిన శివగామి

హీరోయిన్‌గా కంటే.. 'పడయప్ప' చిత్రంలో పోషించిన నీలాంబరి పాత్ర, తాజాగా 'బాహుబలి' చిత్రంలో రాజమాత శివగామి పాత్రల ద్వారానే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ రమ్యకృష్ణ. తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుప

Webdunia
బుధవారం, 10 మే 2017 (14:33 IST)
హీరోయిన్‌గా కంటే.. 'పడయప్ప' చిత్రంలో పోషించిన నీలాంబరి పాత్ర, తాజాగా 'బాహుబలి' చిత్రంలో రాజమాత శివగామి పాత్రల ద్వారానే మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ రమ్యకృష్ణ. తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన తొలి రోజుల్లో ఐరెన్ లెగ్‌గా ముద్రవేయించుకున్న... ఆ తర్వాత సక్సెస్‌పుల్ హీరోయిన్‌గా వెండితెరపై చెరగని ముద్రవేశారు. పిమ్మట దర్శకుడు కృష్ణవంశీని వివాహం చేసుకుని... ఓ బిడ్డకు తల్లి అయింది. అయినా.. కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని గ్లామర్‌తో వెండితెరపై శివగామి రాణిస్తోంది. ఈమె తాజాగా ఓ అంశంపై బోల్డ్‌గా తన మనసులోని మాటను వెల్లడించింది. 
 
ఇటీవలి కాలంలో పలువురు హీరోయిన్లు చిత్రపరిశ్రమలో తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ఒక్కొక్కరుగా నోరు విప్పుతున్నారు. నిర్మాత‌ల‌, ద‌ర్శ‌కుల రూమ్‌లకు వెళితేనే సినిమా అవ‌కాశాలు వ‌స్తాయ‌ని చాలా మంది బాహాటంగా చెప్పారు. అలా లొంగ‌క‌పోతే సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ ప‌డిపోతుంద‌ని స్పష్టంచేశారు. అలాంటి వేధింపులు చాలా ఎదుర్కొన్నామని కూడా కొంతమంది హీరోయిన్లు వెల్ల‌డించారు. ఈ వ్య‌వ‌హారంపై సీనియర్ హీరోయిన్ ర‌మ్య‌కృష్ణ తొలిసారి స్పందించింది.
 
ఇత‌ర రంగాల మాదిరిగానే సినిమా ఇండ‌స్ట్రీలోనూ అడ్జ‌స్ట్‌మెంట్ త‌ప్ప‌నిస‌రి అని శివగామి అంటోంది. అంతేకాకుండా అలా అడ్జ‌స్ట్ అయిన హీరోయిన్లే కెరీర్‌లో ముందుకు వెళ‌తార‌ని అభిప్రాయపడింది. అయితే అడ్జ‌స్ట్ అవ‌డం, కాక‌పోవడం అనేది వారి వారి వ్య‌క్తిగ‌త నిర్ణ‌యాల‌ను బ‌ట్టి ఉంటుంద‌ని, అయితే అలా అడ్జ‌స్ట్ అయితే మాత్రం కెరీర్ పరంగా ముందుకు వెళ‌తార‌ని రమ్యకృష్ణ చెప్పడం ఇపుడు చర్చనీయాంశంగా మారింది. 

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

సింగపూర్‌లో మళ్లీ కోవిడ్ విజృంభణ.. వారం రోజుల్లో 26 వేల మందికి...

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం