Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెటిజన్లు తెగవాడేసుకుంటున్నారంటున్న హీరోయిన్

Webdunia
సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (17:47 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన నటి మాధవీలత. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ప్రస్తుతం బీజేపీ బీజేపీ మహిళా నేతగా ఉన్నారు. గత కొంతకాలంగా ఈమె పేరు సోషల్ మీడియాలో బాగానే ట్రోల్ అవుతోంది. నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తూ వివిధ రకాల కామెంట్స్ చేస్తున్నారు. 
 
దీనిపై మాధవీలత స్పందిస్తూ, సోషల్ మీడియాలో నెటిజన్లు తనను టార్గెట్ చేశారని వ్యాఖ్యానించారు. ప్రతి రెండు రోజులకోసారి తనను ట్రోల్ చేస్తూ పోస్టులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
ముఖ్యంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ కామెంట్స్ చేయడం చాలా బాధగా ఉందన్నారు. సినిమా రంగంలో ఉండటం ఒక నేరంగా, రాజకీయాల్లో ఉండటం మరో నేరంగా భావిస్తూ, ఈ రెండింటిని ఒకదానితో ఒకటి ముడిపెడుతూ ట్రోల్ చేస్తున్నారని ఆరోపించారు. 
 
ప్రజా జీవితంలో ఉన్న తమ క్యారెక్టర్ల గురించి వ్యాఖ్యలు చేయడాన్ని తమ హక్కుగా భావిస్తారని ఇలా ట్రోల్ చేసే వారిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 'ఇలా ఎందుకు రాస్తారు?' అని తిరిగి పోస్ట్ కనుక పెడితే, 'మీకు మీరు సెలెబ్రిటీస్ అని, లీడర్స్ అని ఫీలవుతున్నారా?' అంటూ చెప్పలేని పదాలను వాడుతూ పోస్ట్‌లు చేస్తున్నారని అన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వేసవి రద్దీకి అనుగుణంగా ప్రత్యేక రైళ్లు - విశాఖ నుంచి సమ్మర్ స్పెషల్ ట్రైన్స్!

ఓ పిల్లా... నీ రీల్స్ పిచ్చి పాడుగాను, ట్రైన్ స్పీడుగా వెళ్తోంది, దూకొద్దూ (video)

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments