సిల్వర్ స్క్రీన్‌కు దూరంకానున్న స్టార్ హీరోయిన్ కుమార్తె.. టీవీ సీరియల్స్‌పై గురి!
సిల్వర్ స్క్రీన్‌కు స్టార్ హీరోయిన్ కుమార్తె దూరంకానుంది. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్‌లో సినీ అవకాశాలు ఏమాత్రం లేకపోవడంతో ఆ ముద్దుగుమ్మ ఈ తరహా నిర్ణయ తీసుకుంది. ఆమె పేరు.. కార్తీక. సీనియ
సిల్వర్ స్క్రీన్‌కు స్టార్ హీరోయిన్ కుమార్తె దూరంకానుంది. టాలీవుడ్, కోలీవుడ్, శాండల్‌వుడ్, మాలీవుడ్‌లో సినీ అవకాశాలు ఏమాత్రం లేకపోవడంతో ఆ ముద్దుగుమ్మ ఈ తరహా నిర్ణయ తీసుకుంది. ఆమె పేరు.. కార్తీక. సీనియర్ నటి రాధ కుమార్తె.
తెలుగునాట అక్కినేని వారసుడు నాగచైతన్య హీరోగా ఆరంగేట్రం చేసిన ‘జోష్’ చిత్రంతోనే కార్తీక కూడా వెండితెరకు పరిచయమైంది. తర్వాత తెలుగులో ఎన్టీఆర్ నటించిన ‘దమ్ము’, అల్లరి నరేష్ చెల్లెలిగా ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ చిత్రాల్లో నటించినా.. ఆ సినిమాలు ఆశించినా స్థాయిలో ప్రేక్షకులకు చేరువ కాకపోవడంతో కార్తీకకు గుర్తింపు దక్కలేదు.
దీంతో కాలీవుడ్‌లో అడుగుపెట్టింది. తమిళంలో ‘రంగం’ చిత్రంతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నా..అక్కడ రెండు, మూడు చిత్రాలకే పరిమితమైంది. దీంతో కొద్దిరోజులుగా సిల్వర్ స్ర్కీన్‌కు దూరంగా ఉంటున్న ఈ అమ్మడు..ఇక సినిమాలకు గుడ్‌బై చెప్పేయాలని నిర్ణయించుకుందట. కానీ హిందీ టీవీ సీరియల్స్‌తో ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోందని సమాచారం.