Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనలోకి 'భీమవరం కుర్రోడు' సునీల్...

భీమవరం కుర్రోడు సునీల్. మొదట్లో కమెడియన్‌గా చేరి తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. 6 ప్యాక్‌తో సరికొత్త సినిమాలను తీస్తూ రియల్ హీరో అనిపి

Webdunia
శుక్రవారం, 12 మే 2017 (12:44 IST)
భీమవరం కుర్రోడు సునీల్. మొదట్లో కమెడియన్‌గా చేరి తెలుగు సినీపరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సునీల్ ఆ తర్వాత హీరోగా మారిపోయాడు. 6 ప్యాక్‌తో సరికొత్త సినిమాలను తీస్తూ రియల్ హీరో అనిపించుకున్నాడు. అయితే ఆ తర్వాత హీరోగా పెద్దగా ఆయనకు అవకాశం రాలేదు. సినిమాలు లేకుండా పోయాయి. హీరోగా సునీల్ నటించిన కొన్ని సినిమాలు బాగా ఆడాయి కానీ మరికొన్ని సినిమాలు మాత్రం ఆడలేకపోయాయి. దీంతో సునీల్‌తో సినిమా తీసేందుకు పెద్దగా నిర్మాతలు ఆశక్తి చూపడం లేదు. ముందు నుంచి చిరంజీవి కుటుంబం అంటే సునీల్‌కు ఎనలేని గౌరవం. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే సునీల్‌కు ఎంతో ఇష్టం.
 
పవన్ కళ్యాణ్‌‌తో రెండురోజుల క్రితం పవన్ కళ్యాణ్‌ హైదరాబాద్‌లో సునీల్‌ను కలిసినట్లు తెలుస్తోంది. పిచ్చాపాటి మాట్లాడుకుందామని పవన్‌ను కలిసేందుకు సునీల్ వెళ్ళాడట. అయితే పవన్ మాత్రం సునీల్‌కు బంపర్ ఆఫర్ ఇచ్చారు. అదే జనసేన పార్టీలోకి రమ్మని. సినిమాలు ఉన్నప్పుడు దాని మీద ఏకాగ్రత పెట్టు.. ఖాళీగా ఉన్న సమయంలో పార్టీలో పనిచెయ్యమని పవన్ చెప్పాడట. 
 
దీంతో సునీల్ సరేనని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాలు లేకపోయినా పార్టీలోకి రావడానికి కొద్దిగా సమయం కావాలని మాత్రం పవన్‌ను సునీల్ అడిగినట్లు తెలుస్తోంది. సమయం ఎంత తీసుకున్నా ఫర్వాలేదు.. పార్టీలోకి మాత్రం రావాలని చెప్పాడట. మరి సునీల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments