Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆచార్య' వచ్చే తేదీని ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్

Webdunia
ఆదివారం, 30 ఆగస్టు 2020 (11:41 IST)
మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'గా ప్రేక్షకుల ముందుకురానున్నారు. ఇది చిరంజీవి నటించే 152వ చిత్రం. కొణిదెల ప్రొడక్షన్, మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నారు. అయితే, ఈ చిత్రం షూటింగ్ కరోనా వైరస్ కారణంగా ఆగిపోయింది. అయినప్పటికీ... చిత్ర యూనిట్ తాజాగా ఓ విషయాన్ని వెల్లడించింది. 'ఆచార్య' రిలీజ్ తేదీని నిర్మాతలు ఫిక్స్ చేసేశారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. 
 
ఇప్పటికే 40 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం, లాక్డౌన్ రాకుండా ఉండి వుంటే, దసరా, దీపావళి సీజన్‌లోనే విడుదలై ఉండేది. ఇప్పుడిక మిగతా 60 శాతం షూటింగ్ ఎప్పటికి పూర్తవుతుందో తెలియని పరిస్థితి. అయితే, సినిమా విడుదల తేదీని నిర్మాతలు లాక్ చేసేశారట. 
 
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏప్రిల్ 9కి ఎంత పేరుందో అందరికీ తెలిసిందే. ఆ రోజు విడుదలైన దాదాపు అన్ని చిత్రాలూ సూపర్ హిట్‌గా నిలిచాయన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 'ఆచార్య'ను కూడా ఏప్రిల్ 9న విడుదల చేయనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు కనిపిస్తున్నాయి. 
 
ఇటీవల ఈ చిత్రం టైటిల్ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలై, నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక సినిమా విడుదల తేదీ విషయంలో ఏ మేరకు వాస్తవం ఉందన్న సంగతి తెలియాలంటే నిర్మాతల్లో ఒకరైన రామ్ చరణ్ స్పందించాల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మామ - కోడలు ఏకాంతంగా ఉండగా చూసిన కుమార్తె... తర్వాత...

US : అమెరికాలో ప్రమాదం.. కాలి బూడిదైన హైదరాబాద్ వాసులు.. నలుగురు మృతి

హిమాచల్ ప్రదేశ్‌ వరదలు: బ్యాంకు కొట్టుకుపోయింది.. బంగారం, నగదు ఏమైంది?

Roman: రష్యా మంత్రి రోమన్‌ ఆత్మహత్య.. ఎందుకో తెలుసా?

జపాన్‌లో వరుసగా భూకంపాలు- మణిపూర్‌లో భయం భయం.. యుగాంతం ఎఫెక్టేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments