Webdunia - Bharat's app for daily news and videos

Install App

అమీర్ ఖాన్ "పీకే" బుల్లితెర శాటిలైట్ హక్కులు రూ.85 కోట్లా?

Webdunia
శుక్రవారం, 19 సెప్టెంబరు 2014 (15:46 IST)
బాలీవుడ్‌ 'ఖాన్ త్రయం'లో ఒకరైన అమీర్ ఖాన్ తాజాగా నటిస్తున్న చిత్రం పీకే (PK). ఈ చిత్రంలో ఈ హీరో నగ్నాభినయం కూడా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ విడుదలైన దగ్గర నుంచీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇపుడు బిజినెస్ విషయంలో కూడా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. 
 
రాజ్ కుమార్ హిరాణీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శాటిలైట్ హక్కులను ఓ హిందీ చానల్ 85 కోట్ల రూపాయలను చెల్లించి సొంతం చేసుకున్నట్టు బాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. టీవీ హక్కుల పరంగా బాలీవుడ్‌లో ఇదొక రికార్డుగానే చెప్పుకుంటున్నారు. 
 
ఇక సినిమా మొత్తం బిజినెస్ రూ.300 కోట్ల వరకు చేసిందని అంటున్నారు. ఇటీవలి కాలంలో విడుదలకు ఎంతో ముందుగా ఇంతటి స్థాయిలో బిజినెస్ జరగడం ఒక సంచలన సంఘటనగానే చెబుతున్నారు. కాగా, అమీర్ ఖాన్ సరసన అనుష్క శర్మ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని వచ్చే డిసెంబర్ 19వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
మరోవైపు.. పీకే చిత్రం ఫస్ట్ లుక్‌తో అమీర్ అలా అందర్నీ తనవైపు తిప్పుకున్న విషయం తెల్సిందే. ఒంటిమీద నూలు పోగన్నది లేకుండా, కేవలం ఓ రేడియోని "అక్కడ" ఆచ్చాదనగా ఉంచుకుని, సీరియస్‌గా చూస్తున్న అమీర్ పోజు అందర్నీ ఆలోచింపజేస్తోంది. ఇందులో అమీర్ గ్రహాంతరవాసిగా నటిస్తున్నట్టు సమాచారం. 

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

బీహార్‌లో విషాదం : నలుగురు ప్రాణాలు తీసిన రీల్స్ సరదా!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments