Webdunia - Bharat's app for daily news and videos

Install App

హీరోయిన్లకు విలువెక్కడుందండీ బాబూ....: తాప్సీ

Webdunia
గురువారం, 7 జూన్ 2012 (18:13 IST)
ఇటీవల వస్తున్న, తీస్తున్న చిత్రాల్లో హీరోకున్న ప్రాధాన్యత హీరోయిన్లుకు లేదనేది అందరికి తెలిసిందే. ఇదే విషయాన్ని చాలామంది నటీమణులు పైకి అనకపోయినా.... సందర్భం వస్తే చాలు మనసులో ఉన్నదేమిటో విప్పి చెప్పేస్తుంటారు. ఇటీవలే తన మనసులోని మాటను తాప్సీ చెప్పింది. 

అసలు విషయానికి వెళితే... రవితేజతో 'దరువు'లో నటించిన తాప్సీ పాత్ర నామమాత్రం. అంతా హీరో పైనే నడుస్తుంది. కథ వినేటప్పుడు దర్శకుడు కూడా హీరోకు ఈక్వెల్‌ క్యారెక్టర్‌ అంటూ చెబుతారు. తీరా షాట్‌లోకి వెళ్ళాక అసలు విషయం బయటపడుతుంది. కొన్ని మార్పులు చేస్తారు. హీరోకు సన్నిహితంగా ఉంటే పాత్ర పెరుగుతుంది.

ఇదే విషయమై తాప్సీ మాట్లాడుతూ, తెలుగులో హీరోయిన్లకు ప్రాధాన్యత లేదని చెబితే.. ఇక్కడేకాదు. తమిళ, హిందీ సినిమాలు కూడా చేశాను. అక్కడ కూడా ఇదే పరిస్థితి ఉందని అంది. 'దరువు'లో పాత్ర గురించి చెప్పినప్పుడు హీరోతో పాటు నాక్కూడా సమానంగా ఉండేట్లు దర్శకుడు చూసుకున్నాడని మళ్లీ వెనకేసుకొచ్చింది. తేడా మాట్లాడితే నెక్ట్స్ సినిమాలో ఛాన్స్ ఉండదు కదా.. అందుకే!!

హీరోయిన్‌కు వాల్యూ ఇస్తున్నాం: దరువు దర్శకుడు శి వ
దరువులో రవితేజ పాత్ర చాలా స్పీడ్‌గా ఉంటుంది. తాప్సీ పాత్రకు ప్రాధాన్యత లేదని అంటున్నారే అని అడిగితే.. అటువంటిదేమీలేదు. ఆమె పాత్ర చాలా ఉంది. కథరీత్యా నృత్యం తెలిసున్న అమ్మాయి కావాలి. అందుకే తాప్సీని తీసుకున్నాం. హీరో పాత్ర ఎక్కువైనా తగినట్లుగానే తాప్సీ పాత్రను స్క్రీన్‌ప్లే చేశామని బదులిచ్చాడు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్రైవర్ డోర్ డెలివరీ హత్య కేసు పునర్విచారణ : స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ

డివైడర్‌ను ఢీకొట్టి బొమ్మకారులా గిరికీలు కొట్టిన స్కార్పియో (video)

ABPM-JAY: ఆయుష్మాన్ భారత్ 9.84 కోట్లకు పైగా ఆస్పత్రుల్లో చేరేందుకు అనుమతి

బరువు తగ్గేందుకు ఫ్రూట జ్యూస్ డైట్.. చివరకు...

నిద్రమత్తులో డ్రైవింగ్ చేస్తూ కారును ప్రహరీ గోడపైకి ఎక్కించిన డ్రైవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

Show comments