Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు హిట్: మూడేళ్ల తర్వాతే పెళ్లి.. సమంత

Webdunia
FILE
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సమంత కెరీర్‌లో మంచి హిట్‌గా నిలిచిపోయింది. ఏప్రిల్ నెలతో 26 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సమంత పెళ్లి చేసుకునేందుకు ఇంకా మూడేళ్లు పడుతుందట. తెలుగు ఇండస్ట్రీలో ఏ మాయ చేసావె తర్వాత మంచి ఆఫర్లు రావడంతో.. ఇప్పుడిప్పుడే పెళ్లి బంధంతో కెరీర్‌ను పాడు చేసుకోవడానికి ఇష్టం లేదని సమంత సన్నిహితులతో చెప్పినట్లు తెలుస్తోంది.

తల్లిదండ్రులు ఆంధ్ర, కేరళకు చెందినవారైనప్పటికీ చెన్నై నగరంలో పుట్టిపెరిగిన సమంత తమిళ అమ్మాయినా.. కోలీవుడ్‌లో పేరు తెచ్చుకోలేకపోయింది. కానీ నాగచైతన్యతో కలిసి ఏ మాయ చేసావెలో నటించాక అమ్మడు రేంజే మారిపోయింది. ఆఫర్ల మీద ఆఫర్లు.. బిగ్ హీరోలతో కలిసి నటించే ఛాన్సులతో సమంత బిజీ బిజీగా గడుపుతోంది.

ఇలాంటి పరిస్థితుల్లో సమంత దగ్గర పెళ్లి మాట ఎత్తితే మూడు సంవత్సరాల తర్వాత చేసుకుంటానని చెప్పిందట. మనస్సుకు నచ్చిన వ్యక్తి కంటబడితే తప్పకుండా పెళ్లి చేసేసుకుంటానని సమంత చెబుతోంది. మనస్సుకు నచ్చినోడు దొరికితే మాత్రం మూడేళ్లు వెయిట్ చేయనని సన్నిహితులతో సమంత చెప్పేసిందట.

చదువంటే పడి చచ్చే సమంత.. చెన్నైలోని స్టెల్లా మెరీస్ కళాశాలలో డిగ్రీ చేసింది. ఇంకా పై చదువులకోసం ఆస్ట్రేలియా వెళ్లాలనుకున్న సమంతకు సినీ ఆఫర్లు బ్రేక్ వేశాయి. అప్పుడప్పుడు తన సోదరులతో గొడవపడటం హ్యాపీ అంటున్న సమంతకు అభిమానులు, స్నేహితుల మధ్య నిక్ నేమ్‌లు ఎన్ని వున్నా... ఇంట్లో సమంత నిక్ నేమ్ మాత్రం సామ్ అట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

UP: పాకిస్థాన్‌కు గూఢచర్యం.. యూపీ వ్యాపారవేత్త అరెస్టు.. ఏం చేశాడంటే?

Liquor prices: అన్ని బ్రాండ్ల మద్యం ధరలను పెంచేయనున్న తెలంగాణ సర్కారు

Daughter: ప్రేమ కోసం కన్నతల్లినే హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: ఏడుగురు చిన్నారుల మృతి.. చంద్రబాబు దిగ్భ్రాంతి

పాకిస్థాన్ మిస్సైల్‌ను ఇండియన్ ఆర్మీ ఎలా కూల్చిందో చూడండి (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

Show comments