Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయస్సు 21... కానీ ఆమెకు పిల్లలు 22 మంది

Webdunia
గురువారం, 9 ఆగస్టు 2012 (15:38 IST)
WD
ఆగస్టు 9.. అంటే ఈ రోజే హన్సిక పుట్టిన రోజు. 21వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. గత ఏడాది తెలుగు, తమిళ భాషల్లో కలిపి హన్సిక నటించిన చిత్రాలు అరడజనకు పైనే ఉన్నాయి. ఈ ఏడాది కూడా స్కోర్‌ తక్కువ కాలేదు. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరుగుతున్న మాదిరే సేవా కార్యక్రమాపట్ల ఆసక్తి కూడా పెంచుకున్నారు ఈ బ్యూటీ.

అక్షరజ్ఞానం లేని జీవితం శూన్యం అంటారు కాబట్టి ఆర్థికంగా వెనుకబడి, చదువుకోలేని స్థితిలో ఉన్న 20 మంది పిల్లలను హన్సిక చదివిస్తున్నారు. చదువుతోపాటు ఈ పిల్లలకు అవసరమైన ఇతర సదుపాయాలను కూడా సమకూరుస్తున్నారు.

తన పుట్టినరోజు సందర్భంగా మరో ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంటున్నారు. గత ఏడాది దత్తత తీసుకున్న 20 మంది పిల్లలకు కల్పించిన వసతులనే ఈ పిల్లలకు కూడా కల్పిస్తున్నారు. పిల్లలందరూ తల్లిదండ్రుల సంరక్షణలో ఉంటారు. కాకపోతే వారి ఆలపాలనా చదువుకి అయ్యే ఖర్చు మాత్రం హన్సిక భర్తిస్తోంది. ముంబైలోని మురికివాడలకు చెందిన చిన్న పిల్లలను ఆదుకోవాలని ఈ రకంగా హన్సిక చేస్తున్నట్లు హన్సిక తల్లి డాక్టర్‌ మోనా తెలిపారు.

హన్సిక మాట్లాడుతూ, పిల్లలమీద మమకారంతో వారిని చదివిస్తున్నానని, భవిష్యత్తులో వృద్ధాశ్రమం ఏర్పాటు చేయాలన్నది తన బృహత్కార్యమని పేర్కొంది. ప్రస్తుతం చేస్తున్న చిత్రాల గురించి చెబుతూ.. తెలుగులో విష్ణు సరసన 'దేనికైనా రెడీ', నాగచైతన్యతో ఓ సినిమా, తమిళంలో సేట్టయ్‌, వేట్టయ్‌మన్నన్‌, వాలు, సింగమ్‌-2 చిత్రాల్లో నటిస్తున్నాను. వేట్టయ్‌మన్నన్‌లో గ్యాంగ్‌స్టర్‌ పాత్రలో కన్పిస్తాను. నాలో మరో కోణాన్ని నిరూపించే పాత్ర ఇది. అన్నిరకాల పాత్రలను చేసి నిరూపించుకోవాలి. అందుకే బబ్లీ క్యారెక్టర్లేకాదు. ప్రయోగాత్మక పాత్రలు కూడా చేస్తానని చెప్పారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments