Webdunia - Bharat's app for daily news and videos

Install App

లేచి పోదామా...? అంటోన్న సంధ్య

Webdunia
" ప్రేమిస్తే" చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన యంగ్ హీరోయిన్ "సంధ్య". ఈ సినిమా తర్వాత సంధ్య వెండితెరపై అసలు కన్పించడంలేదని, ఎందుకో చాలా గ్యాప్ తీసుకుందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఒకవైపేమో ఆమెకు ఛాన్స్‌లే రాలేదని కొందరంటుంటే, మరోవైపు ఆమెకు ఛాన్స్‌లొచ్చినా.. ఆ క్యారెక్టర్లు సంధ్యకు ఏమాత్రం నచ్చకే స్క్రీన్‌పై మళ్ళీ కనిపించలేదని అంటున్నారు.

ఈ విషయమై సంధ్యను కదిలిస్తే.. ఆమె కూడా అదే సమాధానమిచ్చింది. అంతేకాదు.. ప్రతిరోజూ తాను ఏరోబిక్స్ చేస్తానని, చిన్న చిన్న వ్యాయామాలు చేస్తుంటానని కూడా చెప్పింది. ఇంతకీ అసలు విషయమేమిటంటే..? "ప్రేమిస్తే" ద్వారా తనకు గుర్తింపు వచ్చిందని, ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే తనను వెతుక్కుంటూ వచ్చాయని చెప్పింది. దీంతో బోర్ కొట్టి అలాంటి చిత్రాల్లో నటించేందుకు అంగీకరించలేదని సంధ్య స్పష్టం చేసింది.

అందుకే భిన్నంగా చేయాలని వల్లభ, అన్నవరం సినిమాల్లో నటించానని, కానీ ఈ చిత్రాల సమయంలో దర్శక, రచయితలచే చాలా మోసపోయానని వాపోయింది. దర్శక, రచయితలు తనకు కథంతా వినిపించి, తన మీదే కథ నడుస్తుందని నమ్మించి, ఆ తర్వాత తనపై తీసిన కొన్ని సన్నివేశాలను ఎడిటింగ్ చేశారని సంధ్య తెలిపింది.

ఇలా చేయడం ద్వారా తన అంచనాలన్నీ తారుమారయ్యాయని ఈ ముద్దుగుమ్మ మనసులోని ఆవేదనను వెలిబుచ్చింది. ఈ కారణంతోనే చాలా గ్యాప్ తీసుకున్నానని, తాజాగా సంగీత సోదరుడు పరిమళ్ హీరోగా "లేచిపోదామా" చిత్రంలో నటిస్తున్నానని తెలిపింది. ఈ సినిమాలోని తన క్యారెక్టర్ చాలా బాగుంటుందని, కథంతా తన చుట్టూ తిరుగుతుందని సంధ్య పేర్కొంది. ఇంకేముంది.. సంధ్యకు నచ్చిన పాత్ర దొరికిందన్నమాట..!. ఇకనైనా సంధ్యకు నచ్చిన పాత్రలే దొరకాలని ఆమెకు మనం కూడా ఆల్ ది బెస్ట్ చెబుదామా..?

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments