ఈ మద్య సినిమా వర్గాల్లో ప్రేమాయణాల గొడవ చాల ఎక్కువైంది. ఆ హీరోయిన్ అతనితో లవ్‌లో ఉందంటూ గాసిప్స్ ఎక్కువైపోతున్నాయి. ఎక్కడ చూసిన ఈ ఎఫైర్ల గోలే. లేటెస్ట్గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తమన్నా ఈ మద్య ఎక్కువగా ప్రేమాయణం నడిపిస్తుందని తెలిసింది. ఇప్పటికే ఈ టాపిక్ బాలీవుడ్లో తెగ హల్చల్ చేస్తోంది.
తమన్నా సినిమాల్లోకి వచ్చి దాదాపు పదేళ్లవుతోంది. ఇప్పటివరకు బోల్డన్ని ప్రేమకథా చిత్రాల్లో నటించింది. కానీ, నిజజీవితంలో హీరో కార్తీతో మాత్రమే ఎఫైర్ సాగించిందనే వార్త మూడునాలుగేళ్ల క్రితం హల్చల్ చేసింది. చివరకు కార్తీకి పెళ్లవడంతో ఆ వార్తకు ఫుల్స్టాప్ పడింది. తాజాగా మరోసారి తమన్నా లవ్టాక్లో నిలిచింది.
ప్రస్తుతం ఆమె నటిస్తున్నవాటిలో హిందీ చిత్రం 'హమ్‌షకల్స్' ఒకటి. ఈ చిత్రదర్శకుడు సాజిద్‌ఖాన్‌తో తమన్నా ప్రేమలో పడిందని బాలీవుడ్ టాక్. ఈ ఇద్దరూ లొకేషన్లో పరిసర ప్రాంతాలను మర్చిపోయి మరీ కబుర్లు చెప్పుకుంటున్నారట. లిఫ్ట్‌లో సాజిద్‌కి తమన్నా ముద్దులు పెడుతూ నలుగురి దృష్టిలో పడిందనే వార్త కూడా ఉంది. ఈ ఎఫైర్ గురించి తమన్నాని ఎవరో అడిగితే, ఫైర్ అయ్యిందని వినికిడి. ఫ్రెండ్లీగా ఉంటే ఎఫైర్ అంటగడతారా? అన్నట్లు మాట్లాడుతోందట. నిజమేంటో తమన్నాకే ఎరుక.