Webdunia - Bharat's app for daily news and videos

Install App

యాడ్ ఫిల్మ్‌లో ప్రిన్స్ మహేష్.. టెన్నిస్ రాణి సానియా!

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2009 (13:50 IST)
File
FILE
టాలీవుడ్ చలన చిత్ర పరిశ్రమలో ప్రిన్స్‌గా పేరుగాంచిన మహేష్ బాబు.. టెన్నిస్ క్రీడారంగంలో తన హృదయ అందచందాలతో కోట్లాది అభిమానుల మనస్సు దోచుకున్న సానియా మీర్జాలు కలిసి నటించనున్నారు. ఒకరు చిత్ర పరిశ్రమ, మరొకరు టెన్నిస్ క్రీడారంగం. వీరిద్దరు కలిసి నటించడం ఏమిటా అని ఆశ్చర్య పోతున్నారా? ఈ కల నిజం కాబోతుంది.

అయితే వెండితెరపై మాత్రం కాదండి. ప్రైవేట్ టెలికామ్ రంగంలో ఒకటిగా పేరొందిన ఎయిర్‌సెల్ కంపెనీ వీరిద్దరితో ఒక యాడ్‌ ఫిల్మ్‌ను తీయనుంది. ఇందుకోసం మహేష్ బాబు డబుల్ డిజిట్‌తో కూడిన కోట్లాది రూపాయలను యాడ్ ఫీజుగా ఛార్జ్ చేయనున్నారు. అలాగే, సానియా మీర్జా కూడా ఇదే మొత్తంలో అడుగుతోందట. సానియాకు చెల్లించే మొత్తంపై ఇరు వర్గాలు ఒక అంగీకారానికి వస్తే ఎయిర్‌సెల్ యాడ్‌లో వీరిద్దరు కనిపించడం ఖాయమంటున్నారు.

ఈ యాడ్‌లో మహేష్-సానియాల మధ్య చిన్నపాటి స్టెప్పులు కూడా ఉంటాయని ఆ కంపెనీ వర్గాల సమాచారం. తమిళనాడు కేంద్రంగా పని చేస్తున్న ఈ టెలికామ్ కంపెనీకి తమిళనాడులో బ్రాండ్ అంబాసిడర్‌గా హీరో సూర్య ఉండగా, తెలుగులో ప్రిన్స్ మహేష్ బాబు ఉన్నారు. వీరుకాకుండా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, సానియా మీర్జాలు కూడా బ్రాండ్ అంబాసిడర్‌లుగా వ్యవహరిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments