Webdunia - Bharat's app for daily news and videos

Install App

బడా హీరోలతో ఛాన్స్ : జోరుమీదున్న కాజల్ అగర్వాల్!!

Webdunia
ఆదివారం, 12 ఫిబ్రవరి 2012 (05:48 IST)
File
FILE
' మగధీర'తో తనకంటూ సుస్థిర స్థానాన్ని ఏర్పరచుకున్న భామ కాజల్ అగర్వాల్. టాలీవుడ్‌లోని ఇతర హీరోయిన్లతో పోల్చితే లక్కీ గర్ల్. ఇందుకు నిదర్శనమే ఈ యేడాది ఐదు భారీ చిత్రాల్లో నటించనుంది. ఇందులో ఒకటి ఇప్పటికే విడుదలై మంచి విజయం సాధించింది. ఆ చిత్రమే ప్రిన్స్ మహేష్ బాబు 'బిజినెస్‌మేన్'. ఇది కాకుండా మరో నాలుగు చిత్రాల్లో నటించేందుకు సంతకాలు చేసింది.

వాస్తంగా టాలీవుడ్‌లో యువ హీరోయిన్లలో సమంతే మొదటి స్థానంలో ఉన్నారు. అయితే, ఈ యేడాది భారీ ప్రాజెక్టుల్లో నటించేందుకు ఎంపికైన ముద్దుగుమ్మల్లో కాజల్ అగర్వాల్‌కే మొదటి స్థానం దక్కిందని చెప్పొచ్చు. ఆ కోవలో తమిళంలో సూర్య, విజయ్ సరటన నటించేందుకు ఎంపికైంది.

అలాగే, టాలీవుడ్ విషయానికి వస్తే.. 'మగధీరుడు' రామ్‌చరణ్‌తో వివివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రంలో కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. దీంతో ఈ చిత్రంపై అటు ప్రేక్షకుల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి. ఎందుకంటే గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన 'మగధీర' తెలుగు చలనచిత్ర చరిత్రలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.

ఆ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించనుంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకుడు. ఈ చిత్రం షూటింగ్ వచ్చే జూన్ నుంచి ప్రారంభంకానుంది. అలాగే, జూనియర్ ఎన్టీఆర్‌తో మరో చిత్రంలో నటించనుంది. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించనున్నారు. జూనియర్‌ ఎన్టీఆర్‌-కాజల్ అగర్వాల్ కాంబినేషన్‌లో లోగడ 'బృందావనం' అనే చిత్రం వచ్చిన విషయం తెల్సిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీతేజ్: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ ఈ అబ్బాయి ఇప్పుడెలా ఉన్నాడు?

పుష్ప 2 బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో 2024కు సెండాఫ్ ఇస్తున్న రష్మిక మందన్న

Mariyamma Murder Case: నందిగాం సురేష్‌కు బెయిల్ నిరాకరించిన సుప్రీం

ఢిల్లీలోని భవనంపై టెర్రస్ నుంచి నవజాత శిశువు మృతదేహం.. ఎలా వచ్చింది?

మాదాపూర్ బార్ అండ్ రెస్టారెంట్‌‌లో అగ్నిప్రమాదం... (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ప్రతిష్టాత్మక IIT మద్రాస్ CSR అవార్డు 2024 గెలుచుకున్న హెర్బాలైఫ్ ఇండియా

పొడియాట్రిక్ పాదాలు-చీలమండ చికిత్సను మెరుగుపరచడానికి ఇసావోట్ అత్యాధునిక ఓ-స్కాన్ ఎంఆర్ఐ మెషీన్‌

చేదుగా వుండే కాకరకాయ ఆరోగ్యానికి అద్భుతమైన మేలు

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Show comments