Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఫంక్షన్లకొస్తే "గాలి" కబుర్లు రాస్తారు: నయనతార

Webdunia
సీనియర్ నటులకంటే కొత్తవారైతే తనకు అనుకూలంగా ఉంటుందని సెక్సీ చూపుల ఒయ్యారి నయనతార చెబుతోంది. నయనతారను హీరోయిన్‌గా బుక్ చేయాలంటే.. ముందుగా అగ్రిమెంట్లో ఆమె పెట్టే కండిషన్లకు ఒప్పుకుని తీరాలి. అవేంటంటే... "సినిమా చేయడం వరకే నా బాధ్యత. ప్రమోషన్‌కి రాను..." ఇత్యాది కండిషన్లు ఎన్నింటినో పెడుతుంది. 

ఆమధ్య శరత్ కుమార్ నటించిన చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేసే సందర్భంలో ప్రమోషన్ కోసం ఆమెకు పారితోషికం ఇచ్చి రప్పించారంటే నయనతార ఎంత ఖచ్చితంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇక "అదుర్స్"లో నటించినా పబ్లిసిటీకి దూరమని తెలియడంతో నిర్మాతలు ఆమెను అప్రోచ్ కాలేదు.

ముఖ్యంగా మీడియా సమావేశాలకు రానని చెపుతుంది. వచ్చిన దగ్గర్నుంచి వారేదో ఊహించుకుని రకరకాలుగా గాసిప్పులు తనపై రుద్దుతారని చెపుతోంది. కాస్త డల్‌గా ఉన్నా, మేకప్ సరిగా వేసుకోకపోయినా వారి ఊహల్లో విహరించి రాసుకుంటారని ఆమె అభిప్రాయమట. ఇక కొత్తవారితో నటిస్తే... వారు చేస్తున్న తప్పులకంటే తను చేసే తప్పులు తక్కువగా ఉండటమే కాక సీనియర్ అనే వాల్యూ ఇస్తారని అంటోంది. నయనతార చాలా చాలా తెలివైన తారలా అనిపిస్తుంది కదూ...!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

Pulasa: పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే- 800 గ్రాముల పులస రూ.22వేలు పలికింది

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు