Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లయిన మగాడితో సదా ప్రేమకలాపాలు...?!

Webdunia
బాంబే పిల్ల సదా "జయం" చిత్రంతో టాలీవుడ్‌లో జయకేతనం ఎగురవేసింది. ఆ తర్వాత శంకర్ అపరిచితుడుతో టాప్ పొజిషన్‌కు చేరుకున్నానని తెగ సంబరపడి పోయింది. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలువ లేదు. తుస్సుమంది. అవకాశాలు అనుకున్నంతగా దొరక్కపోవడంతో మూటాముల్లే సర్దుకుని సొంతూరికి వెళ్లిపోయింది. అయినా ఒక్కసారి సినిమా పురుగు కుడితే దాని నుంచి తప్పించుకుని వెళ్లడం సాధ్యం కాదు గనుక సినిమాలకు దూరంగా ఉండలేని సదా అడపాదడపా కొన్ని చిత్రాల్లో నటిస్తూనే ఉంది. 

ముఖ్యంగా కోలీవుడ్ చిత్ర పరిశ్రమను సదా వదల్లేకుండా ఉంది. దీని వెనుక వేరే కారణం కూడా ఉందని అంటున్నారు. పెళ్లయిన హీరో మాధవన్ కోసమే సదా కోలీవుడ్ చూరు పట్టుక వేళాడుతోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. మాధవన్ సరసన మూడు రొమాంటిక్ చిత్రాల్లో నటించిన సదా అదే రొమాన్స్‌ను నిజజీవితంలోనూ కొనసాగిస్తున్నట్లు భోగట్టా.

ఇది నిజమా సదా...? అని అడిగితే, ఒంటి కాలి మీద ఇంతెత్తున లేచింది. తమ ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధాన్ని వక్రీకరించి కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడింది. తనకూ మాధవన్‌కు మధ్య ఉన్న సంబంధం ఎలాంటిదో మాధవన్ భార్యకు కూడా బాగా తెలుసనీ చెపుతోంది. కనుక సదా - మాధవన్ మధ్య లింకు ఉన్నదని సందేహించేవారు మాధవన్ భార్యను అడిగితే సరిపోతుందన్నమాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అంజనాదేవికి అస్వస్థత .. కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా పవన్ నిష్క్రమణ

Father: కన్నతండ్రే కూతురిపై అత్యాచారయత్నం.. తాగిన మైకంలో శరీర భాగాలు తాకుతూ?

ఆన్‌లైన్‌లో నూడిల్స్ సూప్ ఆర్డర్‌ చేస్తే మొబైల్ ఫోన్ వచ్చింది...

TDP Alliance: టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం 20 సంవత్సరాలు అధికారంలో వుంటుంది - పవన్

Asteroid: 2032లో ఒక పెద్ద గ్రహశకలం చంద్రుడిని ఢీకొట్టవచ్చు: శాస్త్రవేత్తల హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

Show comments