గత కొన్ని రోజులుగా తన వివాహం గురించి మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవాలని, ఇప్పట్లో తనకు పెళ్లి చేసుకునే ఆలోచన లేదని అందాల నటి ఛార్మి తెలిపారు. పంజాబ్‌కు చెందిన ఓ యువకుడితో తనకు నిశ్చితార్థం జరిగిందనీ, వెడ్డింగ్ కార్డ్స్ కూడా ప్రింట్ అయ్యాయని మీడియాలో వచ్చిన వార్తలను చూసి ఆశ్చర్యపోయానని ఛార్మి చెప్పింది.
ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్‌పైనే ఉందని, పెళ్లికి ఇంకా టైమ్ ఉందని, తన పెళ్లి విషయం ముందుగా మీడియాకే చెపుతానని అంటోంది ఛార్మి. అలాంటి రూమర్స్‌ని సృష్టించేవారు తమ విలువైన కాలాన్ని వృధా చేసుకోవద్దని విజ్ఞప్తి చేసింది. తన తాజా చిత్రం "సై ఆట" త్వరలో విడుదల కానుందనీ, ఆ సినిమా తనను సరికొత్తగా చూపిస్తుందని ఛార్మింగ్ గాళ్ ఛార్మి చెబుతోంది.