Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కన్నా పొట్టిగా ఉన్నా.. పెళ్లి చేసుకుంటా..!: అనుష్క

Webdunia
తనకంటే పొట్టిగా ఉండే వ్యక్తిని వివాహం చేసుకోవడంలో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని యోగాటీచర్, బిల్లా సెక్సీడాళ్ అనుష్క అంటోంది. 

కానీ.. పెళ్లితోనే పరిచయమయ్యే వ్యక్తి తన కంటే ఎత్తు తక్కువైతే మాత్రం ఒప్పుకోనని అంటోంది.

అయితే పెళ్లికి ముందే పరిచయమైన వ్యక్తిగా ఉంటే మాత్రం పొట్టిగా ఉన్నా పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తానని ఈ పొడవుకాళ్ల సుందరి స్పష్టం చేసింది.

టాలీవుడ్ కథానాయికల్లో.. ఇతరులను ఇట్టే ఆకట్టు అందచందాలతో ఖచ్చితమైన ఎత్తుతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న అనుష్కకు ఈ మధ్య హైట్ ఓ సమస్యగా మారిందట. ఏ హీరో పక్కన ఆమెను నిలబెట్టినా కథానాయకులే పొట్టిగా కనిపిస్తున్నారట.

తాజాగా కోలీవుడ్ హీరో విజయ్ సరసన "వేట్టైక్కారన్" సినిమాలో అనుష్క నటిస్తోంది. ఈ హీరో చెంతన కూడా అనుష్కనే ఎత్తుగా కన్పిస్తుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. ఈ నేపథ్యంలో.. పెళ్లి చేసుకునే వ్యక్తి మీ కంటే పొట్టిగా ఉంటే చేసుకుంటారా? అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు అనుష్క పైవిధంగా చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే.. తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు సరసన నటిస్తోన్న అనుష్క.. తాను బాగా అభిమానించే కథానాయకుల్లో మహేష్‌బాబు ఒకరని చెబుతోంది. అంతేకాదు.. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటారని అనుష్క కితాబిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

డెలివరీ ఏజెంట్‌గా వచ్చి అత్యాచారం చేశాడంటూ పూణే టెక్కీ ఫిర్యాదు

Son: రూ.20 ఇవ్వలేదనే కోపంతో కన్నతల్లిని గొడ్డలితో నరికి చంపేసిన కొడుకు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments