Webdunia - Bharat's app for daily news and videos

Install App

నన్ను కుక్కపిల్లలా తిప్పుకుంది: అమీషా ప్రియుడు

Webdunia
" బద్రి" చికిత్త అమీషా పటేల్ మళ్లీ ప్రియుడిని వదిలేసింది. తనతో జత కడుతుందేమోనని ఎన్నాళ్లగానో ఆశగా ఎదురు చూసిన బాయ్ ఫ్రెండ్ కనవ్ పురికి హ్యాండ్ ఇచ్చింది. దీంతో అతను అమీషా పేరు చెబితే మండి పడుతున్నాడు. 

ప్రేమ పేరుతో తనను తనవెంట కుక్కపిల్లలా తిప్పుకుందని తన సన్నిహితుల వద్ద వాపోతున్నాడట. అమీషా తనను వదిలిపెట్టినంత మాత్రాన మజ్ను అవతారం ఎత్తబోనని వ్యాఖ్యానిస్తున్నాడట. ఆమెది "టైమ్ పాస్" ప్రేమ అని గమనించలేకపోయానని తెగ బాధపడిపోతున్నాడట.

ఇదిలావుంటే అమీషా పటేల్ మాత్రం కుటుంబ సభ్యుల ముందు ఎవరూ తనకు ఎక్కువ కాదనీ, వారికోసం ఎవరినైనా వదులుకుంటానని సెంటిమెంట్ డైలాగులు కొడుతోందట. కుటుంబ సభ్యులతో ఒకప్పుడు గెంటివేయబడ్డ అమీషా తిరిగి సొంత గూటికి చేరిన అనంతరం తనకు కొత్త శక్తి వచ్చినట్లయిందని ఎంతో సంబరపడిపోతోంది.

ప్రస్తుతం తను ఒంటరిగా, ఫ్రీ బర్డ్ అయినందున ఇక కెరీర్‌పై దృష్టి సారిస్తాననీ, దక్షిణాది సినిమాల్లో నటించేందుకు ఎంతో ఆసక్తిగా ఉందని చెపుతోందట. మరి మన దర్శక నిర్మాతలు ఈ "చికిత్త"కు అవకాశం ఇస్తారో లేదో చూడాలి మరి!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

Pulasa: పుస్తెలమ్మైనా పులస తినాల్సిందే- 800 గ్రాముల పులస రూ.22వేలు పలికింది

Bonalu 2025: బోనమెత్తిన భాగ్యనగరం.. లాల్ దర్వాజ సింహవాహిని మహాకాళి ఆలయంలో సందడి

ఫిర్యాదుపై పట్టించుకోని విచారణ కమిటీ - అందుకే విద్యార్థిని నిప్పంటించుకుంది...

Andhra liquor scam: ఛార్జిషీట్‌లో జగన్ పేరు ఉన్నా.. నిందితుడిగా పేర్కొనలేదు..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments