Webdunia - Bharat's app for daily news and videos

Install App

తన్యను "నాతో రా" అంటోన్న నాగచైతన్య!?

Webdunia
యువసామ్రాట్ అక్కినేని నాగార్జున తనయుడు "నాగచైతన్య" జోష్ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. కుర్రహీరోగా టాలీవుడ్‌‌లో క్రేజ్ హీరోగా ఎదగాలని ఉవ్విళ్ళూరుతున్ననాగచైతన్య.. "జోష్"లో స్టూడెంట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. కానీ "మగధీర" రికార్డులో "జోష్" కొట్టుకుపోయాడని సినీ విశ్లేషకులు అంటున్నారు. 

అయితే తన తొలిసినిమా "జోష్‌"లో ప్రముఖ కథానాయిక రాధ కుమార్తె కార్తికతో జతకట్టిన నాగచైతన్య "నాతో రా" చిత్రం ద్వారా మాస్ ప్రేక్షకులను అలరించాలని భావిస్తున్నాడు. ఇందులో తన్య హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రం షూటింగ్ "జోష్‌"కు ముందుగానే ప్రారంభమైందని, దీనికి "నాతో రా.." అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సినిమా వర్గాల సమాచారం.

ఇకపోతే.. "నాతో రా.." సినిమాకు ఆస్కార్ అవార్డు గ్రహీత ఎ. ఆర్. రెహ్మాన్ సంగీతం సమకూర్చుతున్నట్లు తెలిసింది. అద్భుతమైన ప్రేమకథా నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో యాక్షన్, సెంటిమెంట్ అంశాలుంటాయని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. అలాగే "విలేజ్‌లో వినాయకుడు" ఫేమ్ కృష్ణుడు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. మరి ఈ సినిమా అయినా జోష్‌కు మంచిపేరు సంపాదించి పెట్టాలని ఆశిద్దామా..?
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments