Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిరంజీవి 150వ చిత్రానికి రంగం సిద్ధమవుతోంది!

Webdunia
బుధవారం, 7 డిశెంబరు 2011 (12:28 IST)
FILE
మెగాస్టార్‌ అంటూ చిత్ర రంగంలో పిలుచుకునే చిరంజీవి పార్టీ పెట్టి.. కాంగ్రెస్‌ వ్యతిరేకంగా పోరాడి. మళ్ళీ అదే కాంగ్రెస్‌లో కలవడం ఒక భాగం. అయితే ఇటీవలే కాంగ్రెస్‌వారు ప్రజారాజ్యం పార్టీ వారిని చాలా చులకన చూస్తున్నట్లు ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కాస్తంత అసహనాన్ని కూడా ప్రదర్శించారు.

ఈ నేపధ్యంలో ఈ రొచ్చు రాజకీయాలు మీకెందుకు.. సినిమావైపు కన్నువేయాలని సలహా ఇస్తున్నారట కొంతమంది శ్రేయోభిలాషులు. దాంతో తన 150వ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీయాలని చిరంజీవి కంకణం కట్టుకున్నట్లు భోగట్టా.

దీనికి రచయితలుగా ఎవరైతే బాగుంటుందో అని మరో మాట లేకుండా పరుచూరిబ్రదర్స్‌కు అవకాశం కల్పించారు. వారు ఏడాదినాడు చెప్పిన ఓ స్వాతంత్య్ర సమరయోధుని కథకు మళ్ళీ తుదిమెరుగులుదిద్ది, ఇప్పటి ట్రెండ్‌కు అనుగుణంగా మార్చి తయారుచేస్తున్నారు. బుధవారం కథాచర్చలు మళ్ళీ జరుగుతున్నాయి. ఈ విషయాన్ని పరుచూరి బ్రదర్స్‌ ధృవీకరించారు.

చిరంజీవి కెరీర్‌లో చిరస్థాయిగా నిలిచిపోయే చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నామనీ, చిరంజీవి ఈ చిత్రంలో కొత్తగా కన్పిస్తారని చెబుతున్నారు. మరి ఎలా ఉంటుందో వెయిట్‌ అండ్‌ సీ...

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

Show comments