Webdunia - Bharat's app for daily news and videos

Install App

గీతా ఆర్ట్స్ మల్టీస్టారర్ చిత్రంలో రామ్ చరణ్-అల్లు అర్జున్

Webdunia
గురువారం, 29 అక్టోబరు 2009 (13:46 IST)
File
FILE
క్రేజీ యువ హీరోలు ఇద్దరితో కలిపి గీతా ఆర్ట్స్ ఓ భారీ చిత్రాన్ని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరంటే... రామ్ చరణ్-అల్లు అర్జున్. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఒక మైలురాయిగా నిలిచి పోయేలా ఈ చిత్రాన్ని నిర్మించాలని ఆ బ్యానర్ అధినేత అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారు.

తాజాగా రామ్ చరణ్ తేజ్ నటించిన "మగధీర" చిత్రం సెన్సేషనల్ హిట్ సాధించిన విషయం తెల్సిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ చిత్రం తయారైంది. ఇది ఇచ్చిన సక్సెస్‌తో యువ హీరోలతో భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించాలని అల్లు అరవింద్ భావిస్తున్నారు.

ప్రస్తుతం 'మగధీర' చిత్రాన్ని హిందీలో రీమేక్ చేసే పనుల్లో నిమగ్నమైవున్నారు. ఇందులో హృతిక్ రోషన్ లేదా అమీర్ ఖాన్‌లలో ఎవరో ఒకరు హీరోగా చేసే అవకాశం ఉంది. ఆ తర్వాత హీరో పవన్ కళ్యాణ్‌తో వివి.వినాయక్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రం 2010లో ప్రారంభించనున్నారు.

ఆ తర్వాత సినీ ప్రేమికులు, రామ్ చరణ్, అల్లు అర్జున్ అభిమానులను పూర్తిగా సంతృప్తి పరిచే స్థాయిలో వీరిద్దరితో కలిపి మరో చిత్రాన్ని నిర్మించతలపెట్టారు. ఇందుకోసం అవసరమైన బలమైన కథ కోసం నిర్మాత పలువురు కథా రచయితలను సంప్రదిస్తున్నట్టు సమాచారం.

2011 లో సెట్స్‌పైకి వెళ్లే ఈ చిత్రం తెలుగు వెండితెర చిత్ర పరిశ్రమలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయేలా నిర్మించాలని భావిస్తున్నారు. అలాంటి కథ కోసం నిర్మాత అన్వేషణ సాగిస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్య స్నానం చేస్తుండగా న్యూడ్ వీడియో తీసిన భర్త.. డబ్బు కోసం బెదిరింపులు...

గాల్లో గెలిచిన గాలి నాకొడుకులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు : ఆర్కే రోజా

ప్రియుడితో సుఖంగా జీవించు... భార్యను సాగనంపిన భర్త...

Future City: ఫ్యూచర్ సిటీ, అమరావతిని కలిపే హై-స్పీడ్ రైలు.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారటగా!

Hyderabad: తెలంగాణలో భారీ వర్షాలు- టెక్కీలు వర్క్-ఫ్రమ్-హోమ్ అనుసరించండి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

Show comments